అసలు అల్లు అర్జున్ ఎవరు…?: ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
మెగా ఫ్యామిలీలో యుద్ధం ముదురుతోంది. రోజు రోజుకి సమస్య తీవ్రమవుతోంది. చిన్న చిన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్ళాయి.
మెగా ఫ్యామిలీలో యుద్ధం ముదురుతోంది. రోజు రోజుకి సమస్య తీవ్రమవుతోంది. చిన్న చిన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్ళాయి. ఎంత మంది ప్రయత్నం చేసినా సరే అల్లు అర్జున్ కు ఇతర మెగా హీరోలకు మధ్య దూరం మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా వాతావరణం వేడెక్కుతుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ కు కనీసం మద్దతు ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా కుటుంబం కూడా కోపంగానే ఉంది.
ఇక ఇటీవల పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇక అల్లు అర్జున్ తాజాగా నా ఫ్యాన్స్ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఈ కామెంట్స్ తో మెగా ఫ్యామిలీలో గ్యాప్ నిజమే అనే వరకు వెళ్ళింది. ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని బన్నీ భావిస్తున్నారు. మా తాత సపోర్ట్ చేయకపోతే మీరు అందరూ ఎవరు అనే ఫీల్ లో బన్నీ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. తన తాత, తండ్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉన్నారు కాబట్టే మెగా ఫ్యామిలీ నిలబడింది అనే భావనలో బన్నీ ఉన్నారట.
మొన్నా మధ్య… చిరంజీవి వెళ్లి అల్లు అరవింద్ పక్కన నిలబడితే రామ్ చరణ్ పక్కకు లాగారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో గ్యాప్ పై పెద్ద చర్చ జరగడం మొదలయింది. ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ తో పాటుగా జనసేన నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు. తాజాగా జనసేన నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ కి అసలు ఫ్యాన్స్ ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తండ్రిని ఎంపీగా ఎందుకు గెలిపించలేదు అని నిలదీశారు. నువ్వు సపోర్ట్ చేసిన దగ్గర వైసీపీ ఓడిపోయిందని… నువ్వు రాకపోతే మాకు నష్టం లేదు అంటూ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్స్ ను మెగా ఫ్యాన్స్ ఎక్కువగా షేర్ చేస్తూ బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.