Janhvi Kapoor: ఎన్టీఆర్ కొంప ముంచేస్తున్న బాలీవుడ్ హీరోయిన్..!
జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మ్యాటర్ దేవర టీంని కంగారు పెట్టిస్తోంది. ఎందుకంటే, దేవరలో లీడ్ హీరోయిన్ అయిన జాన్వీ, మరో తెలుగు సినిమాలో ఐటమ్ గాల్ అంటే దేవర తాలూకు క్రేజ్ పడిపోతుందంటున్నారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో వెలిగేందుకు భూ చక్రంలా మారి టాలీవుడ్‌లో ల్యాండైంది. తారక్ (Jr NTR)తో దేవర (DEVARA) మూవీ చేస్తున్నందుకు యంగ్ టైగర్ కంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యింది. మొత్తానికి దేవర షూటింగ్‌తో బిజీ అయ్యింది. అంతా బానే ఉంది కాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో తను ఐటమ్ సాంగ్ చేయటమే తారక్ టీంని కంగారు పెట్టిస్తోంది. బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ (RAM CHARAN) చేసే సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు.
జనవరిలో తెరకెక్కే ఈ మూవీ 2025 జనవరిలో రిలీజ్ అవుతుందట. అంతా బానే ఉంది. ఇందులో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మ్యాటర్ దేవర టీంని కంగారు పెట్టిస్తోంది. ఎందుకంటే, దేవరలో లీడ్ హీరోయిన్ అయిన జాన్వీ, మరో తెలుగు సినిమాలో ఐటమ్ గాల్ అంటే దేవర తాలూకు క్రేజ్ పడిపోతుందంటున్నారు. సరే దేవర ఏప్రిల్‌లో రానుంది. చరణ్ మూవీ 2025లో కదా వచ్చేది. కాబట్టి, ముందుగా తారక్ మూవీనే వస్తుంది. కాబట్టి, అదొచ్చి రిలీజయ్యాక ఆ తర్వాత జాన్వీ ఎందులో ఐటమ్ బాంబ్ పేల్చినా నష్టం లేదు. కాకపోతే దేవర టీంకి నష్టం జరిగేలా ఉందట. ఎందుకంటే దేవరలో జాన్వీ కపూర్ పాత్ర నిడివి చిన్నదని తెలుస్తోంది. దేవర పార్ట్ 2 లోనే జాన్వీ కపూర్ రోల్ పెద్దగా ఉంటుందని గుసగుసలు పెరిగాయి.
దీనికి తోడు దేవర ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది దసరాకు వాయిదా వేసే సూచనలున్నాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శ్రీదేవి కూతురు మెరుపులు తమ మూవీకే చెందాలనుకున్న టీంకి, చరణ్ మూవీలో జాన్వీ ఐటమ్ సాంగ్‌లో మెరవటం ఇబ్బంది కరమైన పరిస్థితే..