అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిన జాన్వీ కపూర్.. పైనుంచి శ్రీదేవి చూస్తుందేమో..!
అమ్మా నాన్న కోరుకున్నది తీర్చడం కంటే పిల్లలకు గొప్ప సంతృప్తి ఇంకేం ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు ఇదే చేస్తుంది.

అమ్మా నాన్న కోరుకున్నది తీర్చడం కంటే పిల్లలకు గొప్ప సంతృప్తి ఇంకేం ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు ఇదే చేస్తుంది. వాళ్ల అమ్మ ఏదైతే కోరుతుందో అది పూర్తిచేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. సరైన టైం చూసి అమ్మ కోరుకున్నది తీర్చేయాలనుకుంటుంది. అసలు ఆమె ఏం కోరుకుందో తెలుసా..! తనలాగే తన కూతుర్ని కూడా సౌత్ ఇండస్ట్రీకి చేరువ చేయడం.. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఎదిగితే చూడాలి అనుకుంది శ్రీదేవి. అది చూడకుండానే శ్రీదేవి వెళ్ళిపోయింది. కానీ అమ్మ కోరిక మాత్రం తాను తీరుస్తాను అంటుంది శ్రీదేవి తనయ. తెలుగు ఇండస్ట్రీకి నెవర్ ఎండింగ్ ఇష్యూ ఒకటి ఉంది. అదే హీరోయిన్ల సమస్య. రోజుకు ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న కూడా ఆ సమస్య మాత్రమే ఎప్పుడూ నిత్య నూతనంగా అలాగే ఉంటుంది. ఇప్పటికీ ఆ ఇష్యూ అలాగే కంటిన్యూ అవుతుంది. అనుష్క, నయనతార కేవలం సీనియర్ హీరోలకు మాత్రమే పరిమితం అయిపోయారు.
మరోవైపు సమంత, తమన్నా, రకుల్ వీళ్లందరితో ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు మన హీరోలు నటించడంతో.. వాళ్ళందరూ బాలీవుడ్ పై ఫోకస్ చేశారు.. లేదంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. పైగా తెలుగులో వాళ్లకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. అందుకే పక్క భాషలపై కాన్సట్రేట్ చేస్తున్నారు. పూజ హెగ్డే, రష్మిక మందన్నకు క్రేజ్ ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోవడం లేదు. కియారా అద్వానీ అప్పుడప్పుడు తెలుగులో నటిస్తోంది. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తున్న నెంబర్ వన్ అయ్యెంత సత్తా లేదు. అందుకే ఇప్పుడు తెలుగులోనే ఉండిపోయే ఒక హీరోయిన్ కావాలి. స్టార్ హీరోలందరూ అలాంటి హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఇచ్చింది జాన్వీ కపూర్.
అయినా తెలుగు ఇండస్ట్రీ కోసం ఈమె సొంత ఇండస్ట్రీని ఏమి త్యాగం చేయడం లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా అక్కడ సినిమాలు చూస్తున్న జాన్వికి కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. అడపాదడపా సినిమాలు చేయడమే కానీ స్టార్ హీరోలు ఇప్పటివరకు జాన్వి కపూర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే అమ్మ కోరిక నెరవేర్చడానికి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా శ్రీదేవి బతికున్నప్పుడు జాన్వి కపూర్ ను తెలుగులో స్టార్ హీరోయిన్ ను చేయాలని బాగా ఆశ పడింది.
ఇప్పుడు భార్య కోరిక దగ్గరుండి తీరుస్తున్నాడు బోని కపూర్. దేవర సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది జాన్వీ. ఇప్పుడు ఇది సెట్స్ పై ఉండగానే.. నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అలాగే సూర్య సినిమాలోని హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరికొందరు హీరోల నుంచి జాన్వి కపూర్ కు అవకాశం రావడం ఖాయం. గతంలో సమంత, తమన్నా, రకుల్, పూజ హెగ్డే, శ్రీలీల విషయంలో ఇదే జరిగింది. ఒక్క స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే చాలు మిగిలిన వాళ్ళందరూ ఆమె వైపు పరుగులు పెట్టడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు జాన్వి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏదేమైనా కరెక్టు టైంలో సూపర్ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.