Janhvi Kapoor: బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ చెప్పిండు.. చెర్రీ తీసుకుండు..

ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 03:46 PMLast Updated on: Mar 06, 2024 | 3:46 PM

Janhvi Kapoor Joins Ram Charan With Buchi Babu Sanas Rc16

Janhvi Kapoor: టాలీవుడ్ నెక్ట్స్‌ బిగ్ థింగ్‌గా మారబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. హిందీలో పెద్దగా స్టార్ డమ్ అందుకోలేకపోయిన జాన్వీ తెలుగులో మాత్రం తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేసేలా ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతోంది జాన్వీ. ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ.

Salaar: సలార్ ర్యాంపేజ్.. ‘శౌర్యంగా పర్వం’.. ఈ సారి ఊచకోతే..!

ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్న రామ్ చరణ్… నెక్స్ట్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్ నుంచి ఆర్సీ 16 సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కొన్ని రోజులుగా ఈ సినిమా హీరోయిన్ విషయంలోనే క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జాన్వీ బర్త్ డే సందర్భంగా బ్యూటీకి విషెస్ చెబుతూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు ఆర్సీ16 మేకర్స్. దీంతో ఇన్నాళ్లు కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ్ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నాడు.

‘ఆస్కార్’ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ చాలా ఏళ్ల తర్వాత #Rc16 మూవీతో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇక ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ నటనకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, హీరోయిన్ కోసం వెతుకుతున్న బుచ్చిబాబు- రామ్ చరణ్‌లకు బ్యూటీని తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడట. దీంతో ఎన్టీఆర్ చెప్పడం జాన్వీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్, చరణ్‌తో ఛాన్స్ అందుకోవడం జాన్వీకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.