Janhvi Kapoor: కమల్ హాసన్ అడగ్గానే ఒప్పేసుకున్న జాన్వీ.. లిస్ట్ లో కరీనా..?
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాకు జాన్వీకపూర్ సైన్ చేసింది. తనే కాదు ఈ విషయంలో కరీనా కపూర్ కూడా క్యూలో ఉంది. బాలీవుడ్ పనైపోయిందనే, ఇప్పుడు అక్కడి ముద్దుగుమ్మలు మెల్లిగా సౌత్ వైపు జారుకుంటూ వచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు వైపు ముఖం కూడా తిప్పని బాలీవుడ్ ఈ బ్యాచ్ మార్కెట్ పల్స్ ని క్యాచ్ చేసింది.

Kamal Hassan Movie Lokanayakudu Special Role In Jahni kapoor
బాలీవుడ్ హీరోయిన్లు అప్పడే ఇంద్రలోకం నుంచి దిగొచ్చినట్టు, సౌత్ సినిమాలంటే చిన్న చూపు చూడటం చూశాం. కాని ఇప్పుడు బీటౌైన్ కథ అడ్డం తిరిగింది. టాలీవుడ్ దేశంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. పాన్ ఇండియా హిట్లతో దూసుకెళుతోంది. తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు కూడా అంతే.. అందుకే ఇప్పడు బాలీవుడ్ హీరోయిన్లు ఇటు వైపు అడుగులేస్తున్నారు.
ఎవరెప్పుడు పిలుస్తారా అని కాల్ షీట్లు పట్టుకుని చూస్తున్నారు. అలా ఇప్పుడు కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు నిర్మించే మూవీకి జాన్వీని తీసుకోవాలంటే, ఏకంగా 80 రోజుల కాల్ షీట్స్ అడిగిన వెంటనే ఇచ్చేసింది. ఇప్పుడు కరీనా కపూర్ కూడా తన మేనేజర్ ని, పీఆర్ ని తెలుగు వాళ్లని పెట్టుకుని ఇక్కడ ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది.
కరీనా, కత్రినా, దీపికా వీళ్ల ఎంతోచూశారు. కాని బాలీవుడ్ లో ఇంకా ఏదో చూసే పరిస్తితి లేదు. సౌత్ సినిమాల్లో క్వాలిటీకి అలవాటు పడ్డ నార్త్ ఆడియన్స్ బాలీవుడ్ లోని లోక్వాలిటీ కథలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే బాలీవు్డ కోలుకోడానికి టైం పడుతుందనే, హిందీ హీరోయిన్లు అడగటమే తడువుగా, సౌత్ లో వాలిపోతున్నారు. దీపికా ఆల్రెడీ ప్రాజెక్ట్ కే చేస్తోంది. శ్రద్ధా సాహో తర్వాత మళ్లీ ఇటువైపు అడుగులేస్తోంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర చేస్తూనే, కమల్ మూవీ రామ్ చరణ్ కొత్త సినిమా కు సై అంది. ఇలా మొత్తానికి ఒకప్పుడు ఇటు వైపు కన్నెత్తి చూడని హిందీ హీరోయిన్లు, సౌత్ నుంచి మరీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పిలుపొస్తే చాలు వాలిపోదామా అనేంత సిద్దమైపోయారు.