Janhvi Kapoor: జాన్వీక‌పూర్ ఇంట అంబానీ పిల్ల‌లు.. రాయ‌ల్ పార్టీ ఇచ్చిన జాన్వీ

జాన్వీ ఇంట్లో జ‌రిగిన ఓ పార్టీలో అంబానీ కూతురు ఇషా అంబానీ, కోడ‌లు శ్లోకా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా అవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 01:20 PMLast Updated on: Apr 16, 2024 | 1:20 PM

Janhvi Kapoors Princess Diaries Royal Slumber Party For Radhika Merchant

Janhvi Kapoor: బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్ భామ అన‌డం కంటే అందాల తార శ్రీ‌దేవి కూతురుగానే ఈ అమ్మ‌డు బాగా ఫేమ‌స్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటుంది. ఇలాంటి క్రేజీ టైమ్‌లో జాన్వీ ఇంట్లో జ‌రిగిన ఓ పార్టీలో అంబానీ కూతురు ఇషా అంబానీ, కోడ‌లు శ్లోకా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ పార్టీ చేసుకున్నారు.

IPL 17 Season : సెలక్టర్లూ మీకర్థమవుతుందా… వరల్డ్‌కప్‌ టీమ్‌లో ప్లేస్ డీకే టార్గెట్

దీనికి సంబంధించిన ఫొటోల‌ను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా అవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇషా అంబానీ, అనంత్ అంబానీ, శ్లోకా మెహతా శనివారం రాత్రి ముంబైలో దిల్జిత్ దోసాంజ్ కచేరీకి హాజరైన తర్వాత జాన్వీ కపూర్ ఇంటికి చేరుకున్నారు. ముంబై రిచెస్ట్ సెల‌బ్రిటీలంతా జాన్వీ క‌పూర్ ఇంట్లో జ‌రిగిన గ్రాండ్ పార్టీకి అటెండ్ అయ్యారు. ఈ స్పెష‌ల్ పార్టీకి వీరంతా డిజైన‌ర్ దుస్తుల్లో స్పెష‌ల్ అపియ‌రెన్స్ ఇచ్చారు. ఇందులో అనంత్ యానిమ‌ల్ ప్రింట్ ఉన్న నీలిరంగు చొక్కా ధరించాడు. కాబోయే పెళ్లి కూతురు రాధికా మ‌ర్చంట్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఇషా పింక్ దుస్తుల్లో అందంగా కనిపించింది. శ్లోకా కూడా గులాబీ రంగు దుస్తుల్లో మెరిసిపోయింది. పార్టీలో అంబానీ కుటుంబ కిడ్స్‌కి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను జాన్వీ త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసింది. అత్యంత ప్రత్యేకమైన వధువు కోసం ప్రిన్సెస్ డైరీస్ రాయల్ స్లంబర్ పార్టీ అంటూ క్యాప్స‌న్ యాడ్ చేసింది.

ఈ ఫొటోలు వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా.. జాన్వీక‌పూర్ త్వ‌ర‌లోనే దేవ‌ర మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన ఈ స్టార్ కిడ్.. త‌న తల్లి త‌ర‌హాలోనే తెలుగులో ఓ వెలుగు వెల‌గాల‌ని క‌ల‌లు కంటోంది. దానికి త‌గ్గ‌ట్లుగానే ఈ చిన్న‌దానికి టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టి వెల్‌క‌మ్ చెబుతున్నాయి. ఎన్‌టీఆర్ సినిమా త‌ర్వాత గ్లోబ‌ర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది ఈ చార్మింగ్ బ్యూటీ.