కండోం యాడ్ కు జన్వీ పర్ఫెక్ట్.. బిజినెస్ మెన్ సెన్సేషనల్ కామెంట్స్
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుంది. వరుస ఆఫర్లతో ఇటు తెలుగులో కూడా బిజీగానే ఉంటోంది.
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుంది. వరుస ఆఫర్లతో ఇటు తెలుగులో కూడా బిజీగానే ఉంటోంది. లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమాతో తెలుగులో పరిచయమైన జాన్వి కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి వైయిట్ ఉంటుందని టాక్. దేవర సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు.
ఈ సినిమాలో మాత్రం కచ్చితంగా ఆమెకు మంచి రోల్ డైరెక్టర్ ప్లాన్ చేశాడని టాక్. ఇక లేటెస్ట్ గా జాన్వి కపూర్ విషయంలో ఓ కండోమ్ కంపెనీ అధినేత చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఇలా సినిమాల్లో దూసుకుపోతున్న జాన్వి కపూర్ ను ఉద్దేశించి ప్రముఖ ఫార్మ కంపెనీ మ్యాన్ కైండ్ అధినేత రాజీవ్ జునేజ తాజాగా రాజ్ షమాని పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ కాంట్రవర్షియల్ కామెంట్లు చేశాడు. తన కంపెనీ నుంచి వచ్చే మాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ కు జాన్వి కపూర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందంటూ కామెంట్లతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
హీరోయిన్స్ లో జాన్వి కపూర్ హీరోలలో రణబీర్ కపూర్ అయితే తమ కంపెనీ కండోమ్ యాడ్ కు పర్ఫెక్ట్ ఫిగర్స్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందు ఇదే కంపెనీకి సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. ఆ తర్వాత హీరో కార్తీక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు. సన్నీలియోన్ కాదని కార్తీక్ ఆర్యన్ ను ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి కారణం.. కండోమ్ విషయంలో మహిళలే కాదు పురుషులు కూడా ముఖ్యమని చెప్పడం కోసమే.
ఇక లైంగిక చర్యలకు అవతలి వ్యక్తి అనుమతి ముఖ్యమని చెప్పడంలో కార్తీక్ ఆర్యన్, మాన్ ఫోర్స్ విజయం సాధించాయని రాజీవ్ కామెంట్స్ చేశాడు. కార్తిక్ ఆర్యన్ కాకుండా మరో సెలబ్రిటీ ఎవరైతే ఈ యాడ్ కు బాగుంటారనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ కండోమ్ యాడ్ కోసమే కాదు మరి ఏ ఇతర యాడ్ కోసం అయినా జాన్వికపూర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఆమె అందరికంటే బెస్ట్ చాయిస్ అన్నాడు. మేల్ యాక్టర్స్ లో అయితే రణబీర్ కపూర్ లక్ష్య రాఘవ్ అయితే బాగుంటారని తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. ఇక తమ కంపెనీ నుంచి వచ్చే ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ యాడ్ కోసం అయితే అనుష్క శర్మ లేదంటే దీపిక పదుకొనే బాగుంటారంటూ రాజీవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తో పాటుగా జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కూడా రాజీవ్ పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ బిజినెస్మెన్ ను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు జనాలు.