వార్ 2 షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కి పూర్తవబోతోంది. సెకండ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అతడుగుపెడతాడన్నారు. కాని సంక్రాంతి తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ఆఫ్ మాసెస్ అడుగుపెట్టేలా ఉన్నాడు. ఆతర్వాత నెల్సెన్ దిలీప్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో దేవర 2 ని కన్పామ్ చేసింది హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్. మొన్నటి వరకు అసలు దేవర 2 ఉంటుందా? ఉండదా? అన్నడౌట్లు లేవనెత్తారు. యాంటీ ఫ్యాన్స్ అయితే దేవర 2 అవసరమా అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మండేలా సోషల్ మీడియాలో మీమ్స్ తో టీజ్ చేశారు. ఇంతలో జాన్వీ కపూర్ తన 60 రోజుల డేట్లు దేవర 2 కోసం బ్లాక్ చేయటంతో, దేవర2 సెట్స్ పైకెళ్లటం కన్ఫామ్ అయ్యింది. ఓరకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది పండగ చేసుకునే న్యూస్... ఫిబ్రవరి నుంచే దేవర 2 పనులు మొదలౌతాయి.. కాని షూటింగ్ మాత్రం సమ్మర్ తర్వాతే అని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి జాన్వీ కపూర్ కంటిన్యూయస్ గా 60 రోజుల కాల్ షీట్స్ దేవర 2 కోసమే కేటాయించటంతో, అసలు సంగతి బయటికొచ్చింది. అసలుకథంతా దేవర 2 లోనే ఉందన్న కొరటాల శివ మాట, ఇప్పుడు జాన్వీ కపూర్ నోటకూడా వస్తోంది. హిందీ మీడియా ముందు తను ఇచ్చిన స్టేట్ మెంట్ తో దేవర 2 పూనకాలు మొదలైనట్టే కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ దేవరతో దుమ్ముదులిపాడు. పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకన్నాడు. లాస్ట్ ఇయర్ సౌత్ నుంచి నార్త్ మార్కెట్ మీద తారక్ దాడి చేస్తే, ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ మీద దాడి చేసేందుకు హిందీ మూవీ వార్ 2తో ఆగస్ట్ 14ని టార్గెట్ చేసుకున్నాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ 90శాతం పూర్తైంది. వచ్చేనెల మొదటి వారంలోగా వార్ 2కి పేకప్ చెప్పే ఛాన్స్ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతి తర్వాత 16 నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ సందడి చేస్తాడని కూడా తెలుస్తోంది. సో వచ్చేనెల నుంచి మరో ఆరునెల్ల వరకు డ్రాగన్ షూటింగ్ తోనే తనకి సరిపోతుంది. తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ మేకింగ్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ఉంది. కాబట్టి దేవర 2 ఇప్పడప్పట్లో ఉంటుందా? అసలు తెరకెక్కుతుందా అన్న డౌట్లే వినిపించాయి కాని వాటన్నీంటికి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బ్రేక్ వేసింది. ఈ అతిలోక సుందరి డాటర్ తన 60 రోజుల డేట్లు పూర్తిగా దేవర 2కే కేటాయించిందట. మొదటి భాగంలో తన పాత్ర నిడివి తక్కువే అయినా రెండోపార్ట్ లో మాత్రం తన రోల్ నిడివి ఎక్కువే ఉంటుందని తేల్చింది. హిందీ యూ ట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వూలో తను 2025 లో కనీసం 60 రోజులు సౌత్ కే పరిమితమౌతానంది.. దానిక కారనం దేవర సీక్వెల్ కోసం తను ఆగస్ట్ నుంచి డేట్లు కేటాయించినట్టు తేల్చింది. అంటే ఆగస్ట్ నుంచే దేవర2 షూటింగ్ మొదలౌతుందనే కన్ క్లూజన్ కి వస్తున్నారు జనాలు. అయితే హీరోయిన్ షూట్ లో పార్టిసిపేట్ చేసే రోజే సినిమా మొదలవ్వాలని లేదు. బేసిగ్గా తెలుగు సినిమాలు హీరో సీన్స్ షూటింగ్ తో మొదలౌతాయి. కొంత షూటింగ్ అయిపోయాక, అప్పుడు హీరోయిన్ సెట్లో అడుగుపెడుతుంది. తన పాత్ర తాలూకు సీన్లు, పాటల షూటింగ్ అంతా సినిమా షూటింగ్ సగం అయిపోయాకే మొదలౌతుంది... ఆలెక్కన అంచనా వేస్తే ఆగస్ట్ కంటే ముందే దేవర2 షూటింగ్ జరిగే ఛాన్స్ఉంది. అదే ఎప్పుడనేది తేలలేదు. కాని సమ్మర్ లో దేవర 2ని డ్రాగన్ తో ప్యార్ లల్ గా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మొత్తానికి దేవర రిలీజ్ టైంలో టార్గెట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ బ్యాచే, దేవర 2 అసలుందా? ఉంటుందా? అవసరమా లాంటి కామంట్లతో ట్రోలింగ్ పెంచారు. అలాంటి టైంలో జాన్వీ కపూర్ తన 60 రోజుల కాల్ షీట్స్ దేవర2 కే కేటాయించటంతో, దేవర 2 ఉండదనే మాటకి బ్రేక్ పడుతోంది. దేవర క్లైమాక్స్ వల్ల క్రియేట్ అయిన డౌట్లకు దేవర2 లో క్లారిటీ దొరకటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. [embed]https://www.youtube.com/watch?v=DSQzvbqBDwI[/embed]