జపాన్, చైనా, కొరియా కొంపలో కుంపటి.. ముందుగా జెండా పాతేది..?

రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ని జూన్ కంటే ముందే మొదలు పెట్టేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ముందు నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే.. కాకపోతే కొన్నిసార్లు కొరియన్ విలన్ డాన్ లీ ఇందులో ఉన్నాడంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 04:16 PMLast Updated on: Feb 03, 2025 | 4:16 PM

Japan China Korea Are In The Middle Of A Fire Which Flag Will Be Raised First

రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ని జూన్ కంటే ముందే మొదలు పెట్టేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ముందు నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే.. కాకపోతే కొన్నిసార్లు కొరియన్ విలన్ డాన్ లీ ఇందులో ఉన్నాడంటున్నారు. ఇంకొన్ని సార్లు తను కాదు, విలన్ గా యానిమల్ ఫేం బాబీ డియోల్ పేరు కూడా ప్రచారం పెంచారు. ఐతే ఈ సినిమా 70శాతం ఇండోనేషియా, జపాన్ లోనే తీయబోతున్నారని తెలుస్తోంది. విచిత్రంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కూడా మేజర్ పార్ట్, ఐతే చైనా, లేదంటే మలేషియా లాంటి లొకేషన్స్ లోనే తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లకంటే వేగంగా వియాత్నంలో ల్యాండ్ అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడకున్నా, తను కూడా పాన్ ఆసియా మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఇండో కొరియన్ హార్రర్ కామెడీ చేస్తున్నాడు. పాన్ ఇండియా హిట్ పడకున్నా, సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తే… ఎన్టీఆర్, ప్రభాస్ ఎందుకు పాన్ ఆసియా మార్కెట్ తోనే సరిపెట్టుకుంటున్నారు.? పని కట్టుకుని కొరియన్ లేదంటే, చైనా, జపనీస్ నటుల్ని, అక్కడి లొకేషన్స్ కే ఎందుకు సై అంటున్నారు…? సాలిడ్ రీజనుంది…అదేంటో చూసేయండి…

1000 కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా హిట్లు.. ఈ టార్గెట్ల పనైపోయింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు అందరి ఫోకస్ పాన్ ఆసియా మార్కెట్. నిజానికి పాన్ వరల్డ్ మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా స్టార్ట్ చేశాడు. కాని అంత స్టామినా తమకి లేదనుకున్నారో, లేదంటే ముందు ఆసియా మార్కెట్ క్యాప్చర్ చేశాకే, వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలనుకున్నారో కాని, జపాన్,చైనా, కొరియా, ఇండోనేషియా, మలేషియానే ప్రభాస్, ఎన్టీఆర్ లు టార్గెట్ అయినట్టుంది.

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ కమిటైన స్పిరిట్ జనవరిలో మొదలవ్వాలి. కాని ఫౌజీ వల్లే జూన్ వరకు వాయిదావేశాడు సందీప్.కాని మార్చ్ నుంచే ఈ సినిమా షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదెలా ఉన్నా, ఈ సినిమా లో దాదాపు 70శాతం లొకేషన్లు, కొరియా, జపాన్, ఇండోనేషియా,మలేషియా ఇలా ఉండోబోతున్నాయి. కేవలం 30శాతం మాత్రంమే ఇండియన్ లొకేషన్స్ లో తెరకెక్కబోతోంది.

దీనికి సాలిడ్ రీజనుంది. జపాన్ లో ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైనాలో బాహుబలి కొంతవరకు రెబల్ స్టార్ కి మంచి గుర్తింపే తెచ్చింది. కాని ఈ సారి స్పిరిట్ తో చైనా, జపాన్, కొరియా మార్కెట్లను టార్గెట్ చేశాడు ప్రభాస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే ఇండోనేషియా, మలేషియా నటుల్ని, విలన్ తో సహా అక్కడి వాల్లతోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మేజర్ షూటింగ్ పార్ట్ ఇండోనేషియా, కొరియా, మలేషియాలోనే డ్రాగన్ షూటింగ్ జరుగుతుందట

ఇద్దరు కట్టకట్టుకుని, కొరియా నటుల్ని, లేదంటే చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా లాంటి లొకేషన్స్ ని టార్గెట్ చేయటానికి రీజన్ అక్కడి మార్కెట్టే… కొరియన్ స్టార్ డాన్ లీ ని అక్కడి బాలయ్యగా మనోళ్లు ముద్దుగు పిలుచుకుంటున్నారు. అంటే ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్లే ఎక్కువగా చేసే తనే, స్పిరిట్ లో విలన్ గా కనిపించబోతున్నాడు. అలా తన వల్ల కొరియా, జపాన్, చైనా మార్కెట్లే కాదు, ఇండోనేషియా ,మలేషియాలో కూడా స్పిరిట్ కి రీచ్ పెరుగుతుంది.

అదే జరిగితే, ప్రభాస్ కి పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియా మార్కెట్ మీద గ్రిప్ దొరకుతుంది. అలానే కొరియన్ మార్కెట్ లో అడుగుపెట్టే స్టార్ కి, పాన్ వరల్డ్ మార్కెట్ లో రీచ్ చాలా ఈజీగా పెరుగుతుంది. అందుకే ప్రభాస్, ఎన్టీఆర్ డైరెక్ట్ గా పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయకుండా, ముందు ఆసియా మార్కెట్ ని కబ్జా చేసే పనిలో ఉన్నారు. మెగా ప్రిన్స్ వరున్ తేజ్ పావు డజన్ ప్లాపులు పడ్డా, ఇండో కొరియన్ హర్రర్ డ్రామా కోసం వియాత్నంలో బిజీ అయ్యాడు. మొత్తానికి పాన్ ఇండియా తర్వాత పాన్ ఆసియానే మనోల్ల టార్గెట్ గా మారింది.