జపాన్ ఫ్యాన్స్ వేలల్లో కాదు లక్షల్లో.. ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ క్లీన్ బోల్డ్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.. తను ఊహించిన దానికంటే ఎక్కువగా అక్కడ గ్రాండ్ వెల్ కమ్ దక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 07:15 PMLast Updated on: Mar 27, 2025 | 7:15 PM

Japan Has Millions Of Fans Not Thousands Ntr Is A Clean Bold For His Fans

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.. తను ఊహించిన దానికంటే ఎక్కువగా అక్కడ గ్రాండ్ వెల్ కమ్ దక్కింది. వేలల్లో కాదు లక్షల్లో తనకి జపాన్ లో ఫ్యాన్స్ఉన్నారని తేలింది. లాస్ట్ ఇయర్ ఇదే వారం జపాన్ మంత్రీ ఎన్టీఆర్ మీద అభిమానంతో బాంబు పేల్చాడు. ఇప్పుడు అక్కడి జనం థియేటర్స్ లో, మెట్రో స్టేషన్స్ లో, ప్రెస్ మీట్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎన్టీఆర్ మీద అభిమానం కురిపించేస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్ నుంచి అభిమానాన్ని ఎక్స్ పెక్ట్ చేసినా, ఈ రేంజ్ లో మాత్రం తను కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదన్నాడు. ఏకంగా టోక్యోలో 5 వేల మంది ఒకేసారి తన కోసం మల్టీ ప్లెస్ ఆవరణలోకి రావటం షాకింగ్ న్యూస్ గా మారింది. అచ్చంగా దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ టైంలో 5 వేల మందిని ఎక్స్ పెక్ట్ చేస్తే 30 వేల మంది ఫ్యాన్స్ వచ్చినట్టు, షాక్ కి గురయ్యాడట తారక్… ఐతే ఇది అంతా అనుకున్నట్టు త్రిబుల్ ఆర్ తో క్రియేట్ అయిన అభిమానం కాదు… సింహాద్రి నుంచే మొదలైన ప్రయాణం అన్నాడు జపాన్ మంత్రి… అదేంటో చూసేయండి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం, దేవర జపాన్ రిలీజ్ కోసం అక్కడ అడుగుపెట్టాడు. రోజుకు వందలకొద్ది యూ ట్యూబర్స్ కి ఇంటర్వూలు, షార్ట్ బైట్ లు ఇస్తున్నాడు. తన లుక్స్ తో, కొత్త కొత్త ఔట్ ఫిట్స్ తో అక్కడ మీడియాలో ఫోకస్ అవుతున్నాడు. ఇక లేటెస్ట్ గా దేవర మూవీ చూసేందుకు టోక్సోలో సందడి చేసిన ఆడియన్స్ లో 95 శాతం లోకల్సే ఉండటం షాకింగ్ గా మారింది.వందల్లో అక్కడ ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తారనుకుంటే, వేలు దాటి లక్షలకు చేరిందా సంఖ్య. మెట్రో స్టేషన్, అలానే మల్టీ కాంప్లెక్స్ కి 5 వేలకు పైగా జపాన్ ఫ్యాన్స్ వచ్చారట. ఎన్టీఆర్ కోసం ఎగబడ్డారట. ఇది జపాన్ మీడియాలో వైరలైన న్యూస్.

ఈనెల 28న అంటే ఈ వీకెండే దేవర జపాన్ థియటేర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ప్రివ్యూని 8 లక్షల మంది చూశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన కొరటాల శివ, ఎన్టీఆర్ కి వాల్లు చెప్పిన వెల్ కమ్ కదిలించిందని తెలుస్తోంది. అక్కడి ఫ్యాన్స్ ప్రేమకి ఎన్టీఆర్ ఫిదా అయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశఆడు.వాల్ల ప్రేమతో తన మనసు నిండిందని, 28న సినిమాహల్లలో జపనీస్ తో కలిసి సినిమాని చూసేందుకు ఇంకా వేయిట్ చేయలేననేంతగా, ట్వీట్ చేశాడు తారక్. విచిత్రం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఏడాది క్రితం ఇదే సమయానికి జపాన్ మంత్రి త్రిబుల్ ఆర్ చూశానన్నాడు. అందులో కొమరం భీమ్ పాత్రకు అభిమానిగా మారానన్న తను, ఎన్టీఆర్ తమకి కొత్త కాదని సింహాద్రి నుంచే తనని అక్కడి జనం ఫాలో అవుతన్నాడన్నారు.

ఎందుకంటే తన సింహాద్రి మూవీ నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు, తన ప్రతీ మూవీ జపనీస్ లో డబ్ అయ్యి యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండటం వల్లే, వాళ్లకి తారక్ మరింత దగ్గరయ్యాడట. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గుర్తింపు రావటంతో, ఇక సీనే మారిపోయినట్టుంది. ఎలాచూసినా బాహుబలి, కల్కీ, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలకంటే దేవరకి జపాన్ లో ఊహాతీతంగా రెస్పాన్స్ వస్తోంది. ఇదే ఊపు 28 తర్వాత కూడా కంటిన్యూ అయితే, 670 కోట్ల దేవర వసూళ్లకి, జపాన్ కలెక్షన్స్ కూడా తోడవ్వొచ్చు.. అదే జరిగితే వెయ్యికోట్ల క్లబ్ లో దేవర అడుగుపెట్టొచ్చు.