Miss Shetty Mr. Polishetty, Jawan : బాక్సాఫీస్ లో పూనకాలేనా..?
ఎలా చూసినా జవాన్ దుమ్ముదులుపుతోంది. విచిత్రంగా మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లొద్దు కాని తల్లికావాలనుకునే ఓ లేడీ, ప్రేమలో పడే హీరో కామెడీ ఈరెండు కలిపితే సినిమా.

Jawaan movie is a strange movie The film is composed by Atlee and the music is composed by Anirudh Tamilulu The heroine Nayanthara and Priyamani are Malayalis but the focus is the batch with Tamila Sinama
జవాన్ మూవీ ఒక విచిత్రమై సినిమా. తీసిన డైరెక్టర్ అట్లీ, సంగీతం సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుత్ తమిళులే.. ఇక హీరోయిన్ నయనతార, ప్రియమణి మలయాళీలే అయినా తమిల సినమాతో ఫోకస్ అయిన బ్యాచ్. ఇక ఇందులో విలన్ విజయ్ సేతుపతి ఇలా ఎలా చూసినా ఇది తమిల్ మూవీని హిందీలో డబ్ చేసినట్టు కనిపించే ప్రాజెక్ట్.
ఇక జవాన్ కథ విషయానికొస్తే ఇద్దరు షారుఖ్ ఖాన్ లు ఒకరు జవాన్, మరొకరు జైలర్, వీళ్లు ఒకరికి ఒకరేమౌతారు. రాబిన్ హుడ్ లా జైలర్ షారుఖ్ ఖాన్ ఎందుకు ప్రభుత్వాన్ని హైజాక్ పేరుతో దోచుకుంటాడు. జనాలకు సొమ్మె పంచుతాడు. తన మోటివేషన్ ఏంటనేదే ఈ సినిమా కథ.
థియేటర్స్ లో పూనకాలు తెస్తున్న కింగ్ ఖాన్ షారుఖ్.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని కమర్శియల్ గా తీయటంలో శంకర్ దగ్గర తర్పీదు తీసుకున్నాడు డైరెక్టర్ ఆట్లీ. ఇక ఓ సౌత్ యాక్షన్ డ్రామ ఎలా ఉంటుందో అలానే జవాన్ ఓవర్ ద టాప్ సీన్లు, హీరోయిజం ఎలివేషన్లు, మొత్తంగా పక్కా ఫార్ములా మూవీ అనేలా ఉంది. షారుఖ్ కి మ్యాటర్ ఉన్నకథ పడితే ఆ లెక్కే వేరు అనేలానే ఈమూవీ లో రెండు పాత్రల్లో పాతుకుపోయాడు కింగ్ ఖాన్.
ఈ వారం బాక్సాఫీస్ లో ఒకేసారి రెండు విచిత్రాలు.
ఎలా చూసినా జవాన్ దుమ్ముదులుపుతోంది. విచిత్రంగా మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లొద్దు కాని తల్లికావాలనుకునే ఓ లేడీ, ప్రేమలో పడే హీరో కామెడీ ఈరెండు కలిపితే సినిమా. టీజర్, ట్రైలర్ పేలలేదు. కాని సినిమామాత్రం దుమ్ముదులపుతోంది. టాక్ కిక్ ఇస్తోంది.
మిస్టర్ పోలిశెట్టినే సినిమా భారం మొత్తం మోశాడా?
ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, జవాన్ భారం మొత్తం మోసింది షారుఖ్ ఖాన్ అయితే, మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి భారాన్ని మోసింది మాత్రం నవీన్ పోలి శెట్టినే. ఇలా ఈ ఇద్దరు హీరోలు ఈ వీక్ కిక్ ఇచ్చారు.