Jawan: కొత్త చరిత్ర సృష్టించిన జవాన్.. అయినా ఆ రికార్డులకు దూరంలోనే..!

బాలీవుడ్ హిస్టరీలో తొలిసారిగా రూ.1100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది జవాన్. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకి రాని వసూళ్లు ఇవి. 5వ వారంలో జవాన్ కలెక్సన్స్ కాస్త మందగించినప్పటికీ.. రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 06:48 PMLast Updated on: Oct 08, 2023 | 6:48 PM

Jawan Movie Creates History At Bollywood Box Office

Jawan: జవాన్ సినిమాతో లెక్కలేనన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు షారుఖ్ ఖాన్. తనకున్న కింగ్ ఖాన్ హోదాను నిలబెట్టుకునేలా వసూళ్లు రాబట్టాడు. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా సరికొత్త వండర్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ హిస్టరీలోనే తనదైన మార్క్ చూపించాడు. బాలీవుడ్ హిస్టరీలో తొలిసారిగా రూ.1100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది జవాన్. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకి రాని వసూళ్లు ఇవి. 5వ వారంలో జవాన్ కలెక్సన్స్ కాస్త మందగించినప్పటికీ.. రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎందుకంటే, ఈ సినిమా ఇంకా చైనాలో రిలీజ్ కాలేదు. అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో కూడా జవాన్ హిట్టయితే ఆ వసూళ్లను ఊహించుకోవడం కూడా కష్టమే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. జవాన్ హిందీ వెర్షన్‌నే చూసుకుంటే.. దేశీయంగా రూ.600 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ సినిమాగా జవాన్ నిలిచింది. విడుదలైన 29వ రోజు కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమా కోటిన్నరకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే, జవాన్ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా వసూళ్లు ప్రస్తుతం రూ.1100 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, బాహుబలి2, దంగల్ సినిమా వసూళ్లతో పోల్చి చూస్తే షారుఖ్ సినిమా ఇంకా వెనకబడే ఉంది. చైనాలో రిలీజై సక్సెస్ అయితే కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లను బ్రేక్ చేసే అవకాశం ఉంది.

మొత్తానికి జవాన్ సక్సెస్‌తో బాలీవుడ్ పూర్తిస్థాయిలో గాడిన పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పఠాన్, గదర్2 బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. రీసెంట్‌గా వచ్చిన ఓ మై గాడ్ 2, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు జవాన్‌తో బాలీవుడ్ పూర్వవైభవాన్ని పొందినట్టయింది. ఈ ఏడాది చివరలో రిలీజ్ కానున్న టైగర్3, యానిమల్ సినిమాలు కూడా సత్తా చాటితే బాలీవుడ్ మళ్లీ స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంది.