రెండేళ్ళు అంటే 35 కావాల్సిందే.. జక్కన్నకు జాన్ అబ్రహం కండీషన్…?
రాజమౌళి సినిమా ఎనౌన్స్ కాగానే బడ్జెట్ ఎంత... హీరో రెమ్యూనరేషన్ ఎంత.. రాజమౌళి ఎంత తీసుకుంటున్నాడు.. సినిమాలో రాజమౌళి పెట్టుబడి ఎంత..
రాజమౌళి సినిమా ఎనౌన్స్ కాగానే బడ్జెట్ ఎంత… హీరో రెమ్యూనరేషన్ ఎంత.. రాజమౌళి ఎంత తీసుకుంటున్నాడు.. సినిమాలో రాజమౌళి పెట్టుబడి ఎంత.. ఇలాంటివి మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సినిమాలో నటించే నటులకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు ఏంటి అనేదానిపై కూడా హడావుడి ఎక్కువగానే ఉంటుంది. సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉండటం, జనాలు కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడంతో ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఏ న్యూస్ వచ్చినా సరే జనాలు పండగ చేసుకుంటూ ఉంటారు. లేటెస్ట్ గా చాలా ఫాస్ట్ గా మహేష్ బాబు సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన రాజమౌళి.. ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎక్కడా బయటకు మాట్లాడొద్దని హీరోకు అలాగే హీరోయిన్ కు మిగతా టెక్నీషియన్లకు అందరికీ ఇప్పటికే రాజమౌళి చాలా గట్టిగా చెప్పాడు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఈ సినిమాలో విలన్ కోసం కేరళ యాక్టర్ ఒకరిని ట్రై చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం విషయంలో రాజమౌళి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. మహేష్ బాబు కూడా అతని కోసం ఇంట్రెస్ట్ గా ఉన్నాడని తెలియడంతో జాన్ అబ్రహం కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎంత అనే విషయం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా దాదాపు రెండేళ్లపాటు టైం కేటాయించాల్సి ఉంటుంది. రెండు పార్ట్ లు గా వస్తున్న ఈ సినిమా 2028లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అప్పటివరకు మరో సినిమా చేసే ఛాన్స్ ఉండదు. దీనితో ఇందులో నటించే ఎవరైనా సరే గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జాన్ అబ్రహం కూడా అలాగే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తాను రెండేళ్ళ సమయం కేటాయించాల్సి ఉంటుందని.. కాబట్టి కనీసం 35 కోట్లు తన కావాల్సిందే అని జాన్ అబ్రహం డిమాండ్ చేశాడట. అతనికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి ఇప్పుడు బతిమిలాడే పనిలో పడ్డాడు. బడ్జెట్ ఎక్కువైపోవడంతో కాస్త తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేశాడట. అయితే రెండేళ్ల పాటు సమయం వద్దని ఏడాది వరకు తనకు కేటాయిస్తే చాలని రెమ్యునరేషన్ విషయంలో ఆలోచించుకోవాలని కోరాడట. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో కూడా ఇలాగే రాజమౌళి డిమాండ్ చేయడంతో అతను కూడా గట్టిగానే అడిగాడు. మరి ఈ ప్రాజెక్టులో విలన్ ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.