ఏడ్చేసిన జానీ మాస్టర్.. షూటింగ్ స్పాట్ లో ఏమైంది..?

లాస్ట్ ఇయర్ జానీ మాస్టర్ ఇష్యూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓ రేప్ కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించడం, బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్ర కష్టాలు పడటం, ఇదే టైంలో ఆయనకు నేషనల్ అవార్డు క్యాన్సిల్ కావడం అన్నీ కూడా సెన్సేషనల్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 12:49 PMLast Updated on: Feb 05, 2025 | 12:49 PM

Johnny Master Cried What Happened At The Shooting Spot

లాస్ట్ ఇయర్ జానీ మాస్టర్ ఇష్యూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓ రేప్ కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించడం, బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్ర కష్టాలు పడటం, ఇదే టైంలో ఆయనకు నేషనల్ అవార్డు క్యాన్సిల్ కావడం అన్నీ కూడా సెన్సేషనల్ అయ్యాయి. ఆ ఘటన తర్వాత జానీ మాస్టర్ సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని చాలామంది హడావుడి చేశారు. ఇక ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆ పార్టీ కూడా ఆయనను సస్పెండ్ చేసింది.

దీనితో జానీ మాస్టర్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన కెరీర్ ను గాడిలో పెట్టుకోవడానికి జానీ మాస్టర్ తీవ్రంగా కష్టాలు పడుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో వచ్చిన ఆఫర్లు కూడా వెళ్లిపోవడంతో.. ఆ తర్వాత కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి, తన పరిచయాలను వాడుకుని మళ్ళీ గాడిలో పడేందుకు రూట్ క్లియర్ చేసుకుని, మళ్ళీ సినిమా షూటింగ్లకు రెడీ అవుతున్నాడు. ఎన్నో హిట్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్, ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు కొట్టేస్తున్నాడు.

తనను ఎవరూ ఏం చేయలేరు అంటూ జానీ మాస్టర్ ప్రూవ్ చేసుకోవడం చూసి, ఆయన అభిమానులు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఆయనపై కేసు పెట్టిన అమ్మాయి చేసిన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో కాస్త సెన్సేషనల్ అవుతున్నాయి. అత్యాచారం ఎప్పటినుంచో జరుగుతుంటే ఆ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయడమేంటంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ముందు జానీ మాస్టర్ ను విమర్శించిన వాళ్లు కూడా, ఆ తర్వాత ఆయనను సపోర్ట్ చేయడం గమనార్హం.

ఇక నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిన సరే జానీ మాస్టర్ మాత్రం ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా, టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. లేటెస్ట్ గా బెంగళూరులోని ఒక సినిమా షూటింగ్ కు అటెండ్ అయ్యాడు జానీ మాస్టర్. బెంగళూరులో షూటింగ్ జరుగుతున్న ఓ తెలుగు సినిమా షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లిన ఆయనకు సినిమా యూనిట్ ముందు గుమ్మడికాయ తో దిష్టి తీయించింది. ఆ తర్వాత కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పింది. వారు చూపిన ప్రేమకు ఆయన సంతోషంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒక మూవీ సైట్ లోకి డైరెక్ట్ గా జానీ మాస్టర్ ఎంటర్ కావడంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేసి ఈసారి కచ్చితంగా నేషనల్ అవార్డు కాదు అంతకుమించి కొట్టాలంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.