నా మొగుడ్ని పెళ్లి చేసుకో, జానీ మాస్టర్ భార్య టార్చర్
జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ రేప్ కేసులో జానీ మాస్టర్ ను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ రేప్ కేసులో జానీ మాస్టర్ ను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కేసు పెట్టినప్పుడు బాధితురాలు పోలీసులకు పలు కీలక విషయాలు చెప్పారు. తనను జానీ మాస్టర్ రేప్ చేసాడని, సినిమా పరిశ్రమ నుంచి పంపించేస్తా అని బెదిరించాడని ఆమె పేర్కొన్నారు.
ఇక మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందని అంటున్నారు. బాధితురాలు హిందువు కావడంతో ఆమెను… మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో జానీ మాస్టర్ భార్య రంగంలోకి దిగారట. బాధితురాలి ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసిందట ఆమె. బాధితురాలు అందుకు నో చెప్పడంతో విచక్షణారహితంగా జానీ మాస్టర్ భార్య ఆమెపై దాడికి దిగారట. ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళింది బాధితురాలు.
అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి దిగేవాడు జానీ మాస్టర్. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, అతని భార్య ఇద్దరూ కలిసి తన ఇంటికి వెళ్లి దాడి చేసారట. ఈ విషయాన్ని కూడా బాధితురాలు పోలీసులకు చెప్పింది. దీనితో జానీ మాస్టర్ తో పాటుగా అతని భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ లు వస్తున్నాయి. సినిమా పరిశ్రమలో ఇక జానీ మాస్టర్ కథ ముగిసినట్టే అంటున్నారు సినిమా ప్రముఖులు. ఇప్పటికే పలువురు నిర్మాతలు జానీ మాస్టర్ ను తమ సినిమాల నుంచి తొలగించారని సమాచారం.