Jr NTR: నెక్స్ట్ వార్ ఇక్కడే.. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘యుద్ధం’ ఇక్కడే

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడు. ఈ షెడ్యూల్ అయిపోగానే హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నాడు టైగర్. అయితే.. వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 30, 2024 | 01:02 PMLast Updated on: Apr 30, 2024 | 1:02 PM

Jr Ntr And Hrithik Roshan Movie War 2 Shooting Starts In Hyderabad

Jr NTR: ఊహించని కాంబినేషన్‌లో వస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ మూవీ ‘వార్‌ 2’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ తలపడితే చూడాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అలాగే.. ఈ ఇద్దరితో ఒక్క మాస్ సాంగ్ పడితే చూడాలని ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను ఇండియాస్ బిగ్గెస్ట్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా నిర్మిస్తున్నారు.

Naga Chaitanya: సాలిడ్ డీల్.. నాగ చైతన్య సినిమాకు 40 కోట్ల డీల్

అయాన్ ముఖర్జీ.. ఎన్టీఆర్, హృతిక్‌ను నెక్స్ట్ లెవల్లో ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే లీక్ అయిన కొన్ని పిక్స్ చెప్పేశాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడు. ఈ షెడ్యూల్ అయిపోగానే హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నాడు టైగర్. అయితే.. వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల పై వచ్చే ఈ సీక్వెన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మే సెకండ్ వీక్ నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారని టాక్.

ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్ హవా నడుస్తోంది కాబట్టి.. నెక్స్ట్ హృతిక్ రోషన్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయితే.. ఆ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ క్రేజీ ఈ కాంబో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి వార్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.