Jr NTR: రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎన్టీఆర్.. విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ..!
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబును పరామర్శించలేదు. చివరికి ట్విట్టర్ ద్వారా కూడా రియాక్ట్ కాలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి విషయంలో విమర్శలు చేస్తున్నారు.
Jr NTR: మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, నందమూరి ఫ్యామిలీ అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయాల్లోనే కాదు.. ఆ కుటుంబంలోనూ మంటలు రేపుతున్నాయి. నందమూరి ఫ్యామిలీకి చెందిన వారు దాదాపుగా అందరూ వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చారు. మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబును పరామర్శించలేదు. చివరికి ట్విట్టర్ ద్వారా కూడా రియాక్ట్ కాలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి విషయంలో విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్‌ను.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఘోరమైన కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను నందమూరి ఫ్యామిలీకి చెందిన వాడు కాదు అన్నట్లుగా కామెంట్లు విసురుతున్నారు. ఇంతటి విమర్శలు వస్తున్న కారణంగానో.. మరి వేరే రీజన్ ఉందో తెలియదు కానీ.. చంద్రబాబును కలిసేందుకు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్దోంది. అతి త్వరలోనే రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ఆ ఇద్దరు పరామర్శించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో ములాఖత్‌కి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు అనే ప్రచారం వినిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబును ఈ అన్నదమ్ములు కలిసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తుండడంతో.. ఇన్ని రోజులుగా వస్తున్న వివాదాలకు, విమర్శలకు బ్రేక్ పడ్డట్లు అవ్వబోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మరీ చంద్రబాబును పరామర్శించేందుకు.. ఎన్టీఆర్ రాజమండ్రి వెళ్లబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్.. డెవిల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అయినా కూడా మామయ్యను చూసి వచ్చేందుకు రాజమండ్రికి తమ్ముడు ఎన్టీఆర్‌తో వెళ్లబోతున్నాడు అంటూ నందమూరి వర్గాలు చెప్తున్నాయి. ఇదే నిజం అయితే.. ఎన్టీఆర్ చుట్టూ పేరుకున్న వివాదానికి బ్రేక్ పడడం ఖాయం.