DEVARA: బడా స్టార్స్ సీక్వెల్ ప్లానింగ్ అదుర్స్.. ఏ మూవీ ఎప్పుడు షూటింగ్..?

ప్రశాంత్ నీల్, తారక్ మూవీ పక్కగా జూన్‌లో మొదలౌతుందట. ఆ తర్వాతే డిసెంబర్‌లో దేవర 2 షూటింగ్ ప్లాన్ చేశాడట కొరటాల శివ. ఇందులో ఎలాంటి మార్పులేదని తెలుస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే తన సలార్ హిట్టైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 05:35 PMLast Updated on: Dec 30, 2023 | 5:35 PM

Jr Ntr And Other Heroes Planning For Sequel Movies

DEVARA: ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర. ప్రజెంట్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్‌లో ఉన్న తారక్, తిరిగొచ్చిన తర్వాత దేవర తాలూకు పెండింగ్ షూటింగ్‌ని జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేస్తాడు. ప్యాచ్ వర్క్, పాటల పని ఫిబ్రవరి, మార్చ్‌లో ప్లాన్ చేశారు. అలానే ఆ రెండు నెలలు ప్రశాంత్ వర్కవుట్లు చేసి కండలు పెంచబోతున్నాడు. అలా వార్ 2 కోసం రెడీ అవుతున్న ప్రశాంత్ ఏప్రిల్ నుంచి వార్ 2 షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడట.

Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

అది చేస్తూనే జూన్ నుంచి ప్రశాంత్ నీల్ మేకింగ్‌లో తారక్ మూవీ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఇది వాయిదా పడిందని ప్రచారం జరిగింది. కాని ప్రశాంత్ నీల్, తారక్ మూవీ పక్కగా జూన్‌లో మొదలౌతుందట. ఆ తర్వాతే డిసెంబర్‌లో దేవర 2 షూటింగ్ ప్లాన్ చేశాడట కొరటాల శివ. ఇందులో ఎలాంటి మార్పులేదని తెలుస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే తన సలార్ హిట్టైంది. వెయ్యికోట్ల వేటలోపడింది. తర్వాత సలార్ 2 ఎప్పుడంటే రకరకాల ప్రచారం జరిగింది. కాని వాస్తవంగా చూస్తే సమ్మర్‌లోగా కల్కి పెండింగ్ షూటింగ్, పూర్తిచేసి, మారుతి మేకింగ్ లో తను చేస్తున్న సినిమాను ఆగస్ట్ లోగా పూర్తి చేస్తాడట ప్రభాస్. అంతేకాదు జూన్‌లో ఇటు స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ మొదలు పెడితే, అప్పుడే హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కుతుందట.

రెండూ ప్యార్‌లల్‌గా తెరకెక్కుతాయని, 2025 సమ్మర్‌లో సలార్ సీక్వెల్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఇక లోకేష్ కనకరాజ్‌తో కార్తి చేయాల్సిన ఖైదీ సీక్వెల్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. రజినీకాంత్ మూవీని మొదలు పెట్టనున్న లోకేష్, తర్వాత వచ్చేఏడాది దసరాకు ఖైదీ 2ని పట్టాలెక్కిస్తాడట. ఆ తర్వాతే విక్రమ్ 2, లియో సీక్వెల్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి దర్శకుల, హీరోల మధ్య పర్ఫెక్ట్ అండర్ స్టాండింగ్‌తోనే సినిమాల ప్లానింగ్ నడుస్తోంది.