Jr NTR-RAM CHARAN: రాజమౌళి ఈ ఇద్దరికీ హిట్ ఇచ్చినా ఫేట్ మాత్రం డౌట్‌లోనే..?
త్రిబుల్ ఆర్‌తో వచ్చిన ఇమేజ్‌ని, మార్కెట్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం తారక్, చరణ్ ఇద్దరూ చేసినా, ఇలా వీళ్ళ కొత్త సినిమాలు ఏళ్లకు ఏల్లు సెట్స్‌కే పరిమితమైతే, కలిసొచ్చిన కిస్మత్ కూడా కరిగిపోతుంది.
Jr NTR-RAM CHARAN: ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారాడు. చరణ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఈరెండు త్రిబుల్ ఆర్ తర్వాతే జరిగాయి. దీంతో వీళ్లకి ప్రమోషన్, త్రిబుల్ ఆర్ సక్సెస్‌తో మార్కెట్‌లో మైలేజ్ వచ్చాయన్నారు. దానికి తగ్గట్టే కొరటాల శివ మేకింగ్‌లో తారక్ దేవరగా మారాడు. శంకర్ మేకింగ్‌లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనిపించుకుంటున్నాడు. ఇలా పక్కా ప్లానింగ్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ అడుగు ముందుకేశారు.
PAWAN KALYAN: ఆ రెండు సీట్లే ఎందుకు..? గెలుపు ఖాయమా..? పవన్ అందుకే ప్రకటించాడా..?
కాని ఏం లాభం. అన్నీ ఉన్నా అదేదో మిస్ అయ్యిందన్నట్టు వీళ్ల ఫేట్, డౌట్లను పెంచుతోంది. ఎన్టీఆర్ విషయానికొస్తే, దేవర ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైంది. మరో నెలయితే దేవర షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఏప్రిల్ 5 కి రిలీజ్ అన్నారు. తీరా చూస్తే వీఎఫ్ ఎక్స్ పూర్తికాలేదు. ఇంతలో విలన్ సైఫ్ ఆలీ ఖాన్ చేతికి గాయం అయింది. కట్ చేస్తే ఏప్రిల్ నుంచి దసరాకు దేవర వాయిదా అంటున్నారు. దేవర పూర్తైతేనే తారక్ వార్ 2 టీంతో జాయిన్ అవుతాడు. కాబట్టి, వార్ 2 మూవీ కూడా లేటుగా తెరకెక్కే పరిస్థితి వచ్చింది. దేవర 2 సంగతి దేవుడెరుగు అనేలా సీన్ మారిపోయింది. ఇక చరణ్ పరిస్థితి చూస్తే, ఎప్పుడో రెండేళ్ల క్రితం లివింగ్ లెజెండ్ శంకర్ మేకింగ్‌లో మూవీకి కమిటయ్యాడు. కేవలం గేమ్ ఛేంజర్ టైటిల్ గ్లింప్స్ తప్ప ఇంతవరకు ఏ అప్‌డేట్ లేదు. భారతీయుడు 2 పెండింగ్ షూటింగ్ పూర్తిచేయాల్సి రావటంతో గేమ్ ఛేంజర్‌కి చాలా సార్లు బ్రేకులు పడ్డాయి.
ఇది కూడా మరో నెలరోజుల్లో షూటింగ్ పూర్తంటూ గత ఆరునెలలుగా చెబుతున్నారు. కాని షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టేదెప్పుడో, రిలీజ్ డేట్ ఎన్నడో తేల్చలేకపోతున్నారు. త్రిబుల్ ఆర్‌తో వచ్చిన ఇమేజ్‌ని, మార్కెట్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం తారక్, చరణ్ ఇద్దరూ చేసినా, ఇలా వీళ్ళ కొత్త సినిమాలు ఏళ్లకు ఏల్లు సెట్స్‌కే పరిమితమైతే, కలిసొచ్చిన కిస్మత్ కూడా కరిగిపోతుంది.