DEVARA: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తా అంటున్న తారక్..

రాజ‌మౌళితో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోలంద‌రూ త‌మ త‌ర్వాతి సినిమాల‌తో ఫ్లాప్‌ను ఎదుర్కొంటారన్న టాక్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, ర‌వితేజ‌తో పాటు రాజ‌మౌళితో ప‌నిచేసిన ప్రతి ఒక్క హీరో ఈ సెంటిమెంట్‌కు బ‌లైపోయారంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 06:29 PMLast Updated on: Jan 10, 2024 | 6:29 PM

Jr Ntr Can Break Sentiment Of Ss Rajamouli With Devara

DEVARA: సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కోట్లతో ముడిప‌డిన బిజినెస్ కావ‌డంలో బడా హీరోల దగ్గర నుంచి దర్శక, నిర్మాతలు కూడా ఈ సెంటిమెంట్స్‌ ఫాలో అవుతుంటారు. అలా సినీ పరిశ్రమ గట్టిగా నమ్మే సెంటిమెంట్లలో దర్శక ధీరుడు రాజమౌళి సెంటిమెంట్ ఒకటి. రాజమౌళి సినిమా అంటే అప్పటి వరకు ఆ హీరోకి ఉన్న ఇమేజ్ కచ్చితంగా డబుల్, ట్రిపుల్ అవుతుంది. రాజమౌళితో సినిమా పడితే ఆ స్టార్ రేంజ్ మరింత పెరుగుతుంది.

GUNTUR KAARAM: మావా ఎంతైనా పర్లేదు బిల్లు అంటున్న మహేశ్.. కొత్త సాంగ్ విడుదల

పాన్ ఇండియా రేంజ్‌ నుంచి వరల్డ్ వైడ్‌ హీరోగా పేరు మార్మోగిపోతుంది. అయితే.. ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే విషయం దేవర సినిమాపై పలు అనుమానాలకు తావిస్తోంది. రాజ‌మౌళితో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోలంద‌రూ త‌మ త‌ర్వాతి సినిమాల‌తో ఫ్లాప్‌ను ఎదుర్కొంటారన్న టాక్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, ర‌వితేజ‌తో పాటు రాజ‌మౌళితో ప‌నిచేసిన ప్రతి ఒక్క హీరో ఈ సెంటిమెంట్‌కు బ‌లైపోయారంటారు. లేటెస్ట్‌గా ఆచార్య సినిమాతో చరణ్‌కు కూడా ఈ విషయం మరోసారి నుభవంలోకి వచ్చింది. రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ఎంత గట్టిగా చెప్పినా ఈ సెంటిమెంట్ మ‌రోసారి రిపీట్ అయ్యింది. దీంతో.. తాజాగా RRR మూవీతో వరల్డ్ వైడ్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. అప్‌కమింగ్ మూవీ దేవరపై అభిమానులకు బెంగపట్టుకుంది. రాజమౌళి సెంట్‌మెంట్‌ను జూనియర్ బ్రేక్‌ చేస్తాడా..? లేదా అందరి హీరోల్లాగా బలవుతాడా అని ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.

కొరటాల డెరక్షన్‌లో వస్తున్న దేవర మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మేకర్స్ వదిలిన ఎన్టీఆర్ లుక్‌ ఈ మూవీపై హైప్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లింది. తారక్ కూడా ఊర మాస్ అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు. మూడు రోజుల క్రితం విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. తారక్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ పక్కా అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. అయినా సరే.. రాజమౌళి సెంటిమెంట్‌పై కాస్త అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే.. దేవర మాత్రం రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తే.. జూనియర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు అవుతుంది. చూడాలి మరి. దేవరపై రాజమౌళి సెంటిమెంట్ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో.