లండన్ లో ఎన్టీఆర్.. జర్మనీలో మహేశ్… మరి ప్రభాస్…?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?... నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?… నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు. మోస్ట్ లీ సండే ఈవెనింగ్ లేదంటే మండే తను విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతా ఇప్పుడే కూడపలుక్కుని ఫారెన్ వెళ్లటానికి ఒకటే రీజన్… న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని విదేశాల్లో జరుపుకోబోతుండటమే కారణం… అంటే వార్ 2 షూటింగ్ కి బ్రేక్ పడినట్టేనా? మహేశ్ బాబు సినిమా అంటే ఇంకా మొదలు కాలేదు…కాబట్టి హాలీడే అంటే అర్ధం చేసుకోవచ్చు…. రెబల్ స్టార్ రెస్ట్ మోడ్ తర్వత ఫౌజీ, ది రాజా సాబ్ కొత్త షెడ్యూల్స్ అన్నారు… అలా అవి సెట్ లో ఉండగా తను ఎలా ఫారెన్ వెళతాడు..? అక్కడే ట్విస్ట్ ఉంది… ఒకే సారి ఇటు పని, అటు హాలీడే సెలబ్రేషన్స్ రెండూ ప్లాన్ చేసుకున్నారు స్టార్స్… ఇంకా ఇలానే ఏ ఏ స్టార్ ఎక్కడ కొత్త ఏడాదిని పండగలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు..?
కొత్త ఏడాది మీద సినిమాల దాడి, సెట్లో హీరోల షూటింగ్ వేడి ఈ రెండూ కూడా కొంత సేపు హోల్డ్ లో పడబోతున్నాయి. స్టార్స్ అంతా హాలిడే మూడ్ లోకి వెళ్లారు.ఎన్టీఆర్ లండన్ లో సేదతీరటమే కాదు, అక్కడే జనవరి 5 వరకు గడిపేయబోతున్నాడు. మొన్నటి వరకు హిందీ మూవీ వార్ 2 షూటింగ్ తో గ్యాప్ లేకుండా 32 రోజులు ముంబై సెట్లో నే గడిపాడు
ఇప్పుడు లండన్ లోఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొడుకు, కూతురే, వైఫ్ ఇలా మొత్తం ఫ్యామిలీతో జర్మీనలో రిలాక్స్ మోడ్ అంటున్నాడు. ఆల్రెడీ రాజమౌళి మూవీ పనిలో భాగంగా జర్మనీలో రెండు సార్లు వర్క్ షాపులకు వెళ్లిన తను, మూడో సారి వర్క షాపులో భాగంగా అక్కడికే వెళ్లాడు. తనకోసం ఫ్యామిలీ వెళ్లి కొత్త ఏడాదిని అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతోంది
రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే, తను ప్రజెంట్ యాంకిల్ ఇంజూరితో, మడమ చికిత్స తీసుకుంటున్నాడు. కంప్లీట్ గా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాడు. సంక్రాంతి వరకు ఇలానే రెస్ట్ తీసుకుని, తర్వాతే ది రాజా సాబ్ సెట్లో అడుగుపెడతాడన్నారు. ఐతే ఈలోపు తను కూడా ఫారిన్ ట్రిప్ వేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
స్పేయిన్ కి రెబల్ స్టార్ బయలు దేరబోతున్నాడట. సండే నైట్ లేదంటే మండే కి స్పేయిన్ కి వెళ్లనున్న ప్రభాస్ అంటున్నారు. అక్కడే న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్న ప్రభాస్, సంక్రాంతి వరకు అక్కడే ఉంటాడని తెలుస్తోంది.
ఇక యూఎస్ నుంచి రీసెంట్ గా రిటర్న్ అయిన చరణ్ కూడా సినిమా ప్రమోషన్ లో భాగంగా న్యూ ఇయర్ కి యూకేలో ప్రత్యక్షం అవుతాడట. తర్వాత ఐదో తేదీన గేమ్ ఛేంజర్ తాలూకు ముంబై ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కేసు వల్ల బన్నీ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈసారి అక్కినేని ఫ్యామిలీ అంతా యూరప్ టూర్ లో ఉండబోతోందని న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని అక్కడ ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీ, వారంరోజులు అక్కడే గడపబోతోంది. మొత్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అరడజన్ స్టార్ హీరోల ఫ్యామిలీస్ పూర్తిగా యూరప్ లేదంటే, యూఎస్ కి ఎగిరిపోతున్నారు.