DEVARA: గ్లింప్స్ రెడీ.. పుష్ప, దేవరలో గంగమ్మ జాతర..!

దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయినట్టుగా ట్రెండ్ అవుతోంది. దీంతో దేవర గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఖచ్చితంగా న్యూ ఇయర్‌ లేదా సంక్రాంతికి దేవర సాలిడ్ ట్రీట్ ఉంటుందని అనుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2023 | 03:41 PMLast Updated on: Dec 26, 2023 | 3:41 PM

Jr Ntr Devara Glimps Will Be Released Soon

DEVARA: దేవర, ఎన్టీఆర్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దేవర సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిపోయాడు ఎన్టీఆర్. అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయినట్టుగా ట్రెండ్ అవుతోంది. దీంతో దేవర గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.

SALAAR: హార్ట్ టచింగ్‌గా సలార్ సాంగ్.. ప్రభాస్ ఎమోషనల్

ఖచ్చితంగా న్యూ ఇయర్‌ లేదా సంక్రాంతికి దేవర సాలిడ్ ట్రీట్ ఉంటుందని అనుకున్నారు. ఈ రెండు కాకుండా.. లేటెస్ట్‌గా దేవర గ్లింప్స్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. జనవరి 8న దేవర గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపుగా ఆ రోజు దేవర నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ బయటికి రావడం పక్కా అంటున్నారు. ఒకవేళ అప్పటికి కుదరదంటే.. జనవరి రెండో వారంలో సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికీ దేవర గ్లింప్స్‌ని అటాచ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం కొరటాల శివ టీజర్ కట్ పనులతో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో గ్లింప్స్‌ రెడీ చేస్తున్నాడట కొరటాల.

రెండు భాగాలుగా రానున్న దేవర మొదటి భాగం ఏప్రిల్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీలో గంగమ్మ భక్తుడిగా తారక్ కనిపించనున్నాడట. ఇప్పటికే జాతర ఎపిసోడ్స్ కి సంబందించిన సీన్లను తెరకెక్కించారట. పుష్పలో కూడా గంగమ్మ జాతర సీన్లు ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదేబాటలో వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.