Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే గోవాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీలపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. అక్కడే ఒక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 11:11 AMLast Updated on: Mar 15, 2024 | 11:11 AM

Jr Ntr Devara Shooting Will Start In Goa Soon

Devara: గత కొద్ది రోజులుగా దేవర షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు షూటింగ్‌లో గాయాలు అవ్వడంతో.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే దేవర షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఆ ప్రభావం సినిమా విడుదల డేట్‌పై కూడా పడింది. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర.. అక్టోబర్ 10కి షిఫ్ట్ అయింది. అయినా కూడా అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.

RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే గోవాలో ఎన్టీఆర్, సైఫ్, జాన్వీలపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. అక్కడే ఒక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట. సైఫ్ అలీఖాన్ డేట్‌ల విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందట. గతంలో కూడా కొన్ని కీలక షెడ్యూల్స్ గోవాలో చిత్రీకరించారు. ఇక ఇప్పుడు మరోసారి గోవాకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు దేవర. నెక్స్ట్ వీక్ నుంచి దేవర షూటింగ్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో.. బాహుబలి తరహాలోనే ఎన్టీఆర్ పాత్రను చూపించబోతున్నాడట కొరటాల.

ఫస్ట్ పార్ట్‌లో కొడుకు క్యారెక్టర్‌ హైలెట్ చేసి.. సీక్వెల్‌లో తండ్రి క్యారెక్టర్‌ని రివీల్ చేసి.. పార్ట్ 2కి లీడ్ ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి.. ఈసారి కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే.. మరో కీలక పాత్రలో శృతి మరాటే నటిస్తోంది.