Jr NTR: బాలయ్యకు విషెస్ చెప్పని తారక్.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా..
బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్యాప్ పెరిగిపోయిందా ? ఇంతకాలం తనను దూరంగా ఉంచిన బాలయ్యను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడుతున్నారా ? తాత అంటే ప్రాణాలిచ్చే జూనియర్.. తన తాత శతజయంతి ఉత్సవాలకు రాకపోవడానికి కారణమేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు.

Jr NTR Can Not Say Withses To Balakrishna
జూనియర్ ఎన్టీఆర్‌ను ఆ కుటుంబ సభ్యులు కావాలనే దూరం పెట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ జూనియర్‌ను ఎప్పుడూ ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు. కానీ తారక్‌కు మాత్రం బాలకృష్ణ అంటే చచ్చేంత ఇష్టం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం జూనియర్ కూడా ఇక బాలకృష్ణను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా బాలకృష్ణ పుట్టిన రోజున ఎన్టీఆర్ విష్ చేయకపోవడమే ఈ అనుమానాలకు కారణం. ఇప్పుడే కాదు. వరుసగా మూడేళ్ల నుంచి ఎన్టీఆర్ బాలకృష్ణకు విషెస్ చెప్పడంలేదు. అంతే కాదు రీసెంట్‌గా నిర్వహించిన శతజయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ రాలేదు.
తన బర్త్‌డే సందర్భంగా కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లానని చెప్పాడు. తాత అంటే ఎంతో అభిమానించే ఎన్టీఆర్ కేవలం బర్త్‌డే కారణంగా ఉత్సవాలకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తరువాత ఎన్టీఆర్ శతజయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించాడు తారక్. దీంతో బాలకృష్ణ నిర్వహించిన కారణంగానే శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ రాలేదు అని అంతా ఫిక్స్ అయ్యారు. దానికి తోడు ఇప్పుడు బర్త్‌డే విషెస్ కూడా చెప్పకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఇంతకాలం తనను దూరంగా ఉంచిన బాలకృష్ణకు ఇక నుంచి తానే దూరంగా ఉండాలని తారక్ నిర్ణయించుకున్నానే టాక్ నడుస్తోంది.