Jr. NTR: రీ-రిలీజ్‌ సినిమాకు కూడా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌.. ఇది కదా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటే..

ఫ్యాన్స్‌కి ఎమోషన్స్‌ తప్ప లాజిక్స్‌ ఉండవ్‌. ఏ హీరో ఫ్యాన్స్‌ అయినా ఇలానే ఉంటారు. జనరల్‌గా ఫ్యాన్స్‌ అంటేనే అంత. అప్పుడప్పుడు వాళ్ల అభిమానం చూస్తే హీరోలే షాకవుతుంటారు. నార్మల్‌ హీరోల ఫ్యాన్సే ఇలా ఉంటే ఇక స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ఎలా ఉంటారో సపరేట్‌గా చెప్పాలా. తమ ఫేవరెట్‌ స్టార్‌ కోసం వాళ్లు చేసే పనులు నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2023 | 12:40 PMLast Updated on: May 18, 2023 | 12:40 PM

Jr Ntr Fans Did Pre Release Event To Simhadri

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్సే దీనికి ఎగ్జాంపుల్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌ సింహాద్రి సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. దీని కోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. ఏకంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ వీరాభిమాని హీరో విశ్వక్‌సేన్‌ గెస్ట్‌గా వచ్చాడు. నార్మల్‌గానే చాలా కాలం నుంచి టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. హీరోల సూపర్‌ హిట్‌ సినిమాలను వాళ్ల పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేస్తున్నారు. అందరి సినిమాలు వచ్చినా ఎన్టీఆర్‌ సినిమా మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్‌ కోసం సింహాద్రి సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.

ఏ సినిమా రీ-రిలీజైనా ఫ్యాన్స్‌ కాస్త హంగామా చేయడం కామనే.. కానీ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించి నెక్స్ట్‌ లెవెల్‌ అనిపించారు. సింహాద్రి సినిమా ఇప్పుడే కొత్తగా రిలీజ్‌ అవుతోంది అన్నట్టుగా వాళ్లు చేసిన గోల అంతా ఇంతా కాదు. రీ-రిలీజ్‌కే ఇలా చేస్తే ఇక ఎన్టీఆర్‌-30 సినిమాకు సెలబ్రేషన్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉండటం గ్యారంటీ. పాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌-30 సినిమాపై ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. మే20న సింహాద్రి రీరిలీజ్‌తో పాటు ఎన్టీఆర్‌-30 నుంచి అప్‌డేట్‌ కూడా రానుంది. ఈ సినిమాను ప్రస్తుతం ఎన్టీఆర్‌-30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో పిలుస్తున్నారు. మే20 సినిమా టైటిల్‌ ఎనౌన్స్‌ చేస్తారని టాక్‌. సింహాద్రి రీ-రిలీజ్‌కే ఇలా చేస్తే.. ఎన్టీఆర్‌-30 సినిమా రిలీజ్‌కు ఎలా హంగామా చేస్తారో చూడాలి.