DEVARA: అనిరుధ్ మ్యూజిక్‌పై విమర్శలు.. ఇదేంటి బ్రో..?
జాన్వీ కపూర్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సందడి గ్లింప్స్‌తోనే మొదలైంది. కాని ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద, అనిరుధ్ పైత్యం మీద కామెంట్ల వర్షం పెరిగింది. ఆల్రెడీ కొన్ని సినిమాలకు వాడిన మ్యూజిక్‌నే దేవరకి కట్ అండ్ పేస్ట్ చేసిన అనిరుధ్ అంటూ కామెంట్లు పెంచారు.
DEVARA: దేవర పార్ట్ వన్ ఈ సమ్మర్‌లో రాబోతోంది. జాన్వీ కపూర్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సందడి గ్లింప్స్‌తోనే మొదలైంది. కాని ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద, అనిరుధ్ పైత్యం మీద కామెంట్ల వర్షం పెరిగింది. ఆల్రెడీ కొన్ని సినిమాలకు వాడిన మ్యూజిక్‌నే దేవరకి కట్ అండ్ పేస్ట్ చేసిన అనిరుధ్ అంటూ కామెంట్లు పెంచారు. అది కూడా పక్కన పెడితే, ఇంగ్లీష్ పాటలాగా బీజీఎం వర్షన్‌ని అనిరుద్ ప్లాన్ చేయటం కొంపముంచేలా ఉంది.
GUNTUR KAARAM: మావా ఎంతైనా పర్లేదు బిల్లు అంటున్న మహేశ్.. కొత్త సాంగ్ విడుదల
లియో మూవీలో కూడా ఇంగ్లీష్ సాంగ్ ఉంది. కమల్ హాసన్‌తో లోకేష్ కనకరాజ్ తీసిన విక్రమ్ మూవీలో కూడా అలాంటి ఇంగ్లీష్ పాటే పెట్టాడు అనిరుధ్. ఇది లోకేష్ కనకరాజ్ నిర్ణయం వల్లే జరిగిందో, లేదంటే తనిచ్చిన ఫ్రీడమ్ వల్ల అనిరుధ్ చేశాడో కాని, ఆ రెండు మూవీల్లో ఇంగ్లీష్ సాంగ్స్ వర్కవుట్ అయ్యాయి. దీంతో అదే పద్దతిని దేవరకి అప్లై చేయబోయాడు అనిరుధ్. ఆ ప్రాసెస్‌లోనే అదే పాటని దేవర బీజీఎంగా వాడాడట. అది సోసోగా ఉండటంతో కామెంట్లు పెరిగాయి. దేవరకి క్వాలిటీ గ్రాఫిక్స్ దొరికినా, క్వాలిటీ మ్యూజిక్ వస్తుందా అనంటున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగు సినిమాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వరనే కామెంట్లతో సోషల్ మీడియాలో దండయాత్రలు పెరిగాయి.