Jr NTR: అమెరికాలో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌!

లేట్‌గా అమెరికాలో ఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అమెరికాలో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే తారక్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2023 | 03:56 PMLast Updated on: Mar 07, 2023 | 3:56 PM

Jr Ntr Gets Huge Welcome In America

ఆస్కార్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ కోసం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అమెరికాకు వెళ్లాడు. ఎన్టీఆర్‌ మాత్రమే కాదు ట్రిపులార్‌ సినిమా మేజర్‌ కాస్ట్‌ అండ్ క్రూ మొత్తం ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. ఈ నెల 12న ఆస్కార్‌ అవార్డ్‌ ప్రజెంటేషన్‌ ఉండటంతో అంతా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎవరికీ వారు ప్రమోషన్స్‌లో మునిగిపోయారు.

లేట్‌గా అమెరికాలో ఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అమెరికాలో అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే తారక్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌. మ్యాన్‌ ఆఫ్ మాసెస్‌ అంటూ ఎన్టీఆర్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్‌కు హాయ్ చెప్పిన ఎన్టీఆర్.. ఆ తరువాత ఓ ఫ్యాన్‌ మీట్‌కు హాజరయ్యాడు. ఇండియాలో ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌ ఎప్పుడూ ఫ్యాన్‌ మీట్‌ నిర్వహించలేదు. కానీ ఆ అదృష్టం ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌కు దక్కింది. ఎన్టీఆర్‌ను చాలా క్లోజ్‌గా చూసిన ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.

ఫ్యాన్స్‌ చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తనపై ఇంత అభిమానం పెంచుకున్నందుకు జీవితాంతం వాళ్లకు రుణపడి ఉంటానన్నారు. తనను అభిమానులు ఎంత ప్రేమిస్తారో.. అంతకంటే ఎక్కువ తాను కూడా అభిమానులను ప్రేమిస్తానంటూ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు. వాళ్లు చూపిస్తున్న ప్రేమకు తలవంచి పాదాభివందనం చేశాడు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఫ్యాన్‌తో ఫొటోలు దిగాడు ఎన్టీఆర్‌. ప్రేమగా వాళ్లతో మాట్లాడాడు.

దీంతో యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాను దున్నేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తీసుకున్న సెల్ఫీలను పోస్ట్‌ చేస్తున్నారు. తమ అన్నను కలిశామంటూ ట్యాగ్‌లు పెడుతున్నారు. మరోపక్క రాజమౌళి, రామ్‌ చరణ్‌ కూడా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే జక్కన్న టీం మొత్తం 12న ఆస్కార్‌ను ఇండియాకు తీసుకువస్తారా లేదా చూడాలి మరి.