మ్యాన్ ఆఫ్ మాసెస్ యోధుడు… గ్లోబల్ గా మెగా”బాధుడు”…
దేవర వచ్చినప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ పనైపోయిందన్నారు. పాటలు కాపీ అన్నారు. తన పాత్రల మీద కూడా కామెంట్ చేశారు. కట్ చేస్తే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటం తారక్ తరం కాదని తేల్చారు.
దేవర వచ్చినప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ పనైపోయిందన్నారు. పాటలు కాపీ అన్నారు. తన పాత్రల మీద కూడా కామెంట్ చేశారు. కట్ చేస్తే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటం తారక్ తరం కాదని తేల్చారు. అలా యాంటీ ఫ్యాన్స్ దేవర రిలీజైన రెండు మూడు రోజుల వరకు ఇలానే కామెంట్లు పేల్చారు. కట్ చేస్తే మ్యాన్ఆఫ్ మాసెస్ మరే తెలుగు హీరోకి సాధ్యం కాని పని చేశాడు. రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక తనతో పాటే త్రిబుల్ ఆర్ లొ స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ మాత్రం రాజమౌళి సెంటి మెంట్ కి బలయ్యాడు. ఒక సారి కాదు రెండుసార్లు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.ఇందులో కామన్ పాయింట్ ఏంటంటే, దేవర మూవీ వచ్చినప్పుడు ఒక పాట మిస్సైంది. గేమ్ ఛేంజర్ లో కూడా ఒక పాట మిస్ అయ్యింది. కాని ఇద్దరి లో సక్సస్ మాత్రం ఒకరికే మిస్సైంది… దేవరమీద ఎంతగా ట్రోలింగ్స్ జరిగినా, ఎంతగా నెగెటీవ్ కామెంట్స్ వచ్చినా, ఎన్టీఆర్ ఈజీగా రాజమౌలి సెంటి మెంట్ ని బ్రేక్ చేయగలిగాడు. గేమ్ ఛేంజర్ కి ఎంతగా హైప్ క్రియేట్ అయినా, శంకర్ పుణ్యమాని పూర్తిగా గ్లోబల్ స్గార్ కి కామెంట్ల భాదుడు తప్పట్లేదు… ఇంతకి రాజమౌళి సెంటిమెంటల్ శాపం నుంచి చరణ్ కి విముక్తి ఎప్పుడు?
దేవర హిట్టైంది… ఇక గేమ్ ఛేంజర్ వంతే అన్నారు. ఏమైంది… గేమ్ ఛేంజ్ అయిపోయింది. అది కూడా మొదటి రోజు మొదటి ఆటకే. నిజం చెప్పాలంటే ప్రివ్యూకే రివ్యూలొచ్చేయటంతో, గేమ్ ఛేంజర్ గేమ్ జామ్ అయిపోయింది.
అంతే, ఇప్పుడు దేవర పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కారనం రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఒకే ఒక్క యోధుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆల్రెడీ ఆచార్యతో ఫ్లాప్ ఫేస్ చేశాడు
వెంటనే రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా, ఆవెంటనే ఫ్లాప్ బాటపట్టాల్సిందే అని మరో సారి ప్రూవ్ అయ్యిందన్న్నారు. కట్ చేస్తే అది మెగా స్టార్ సినిమా… ఆచార్య లో చరణ్ వేసింది కేవలం గెస్ట్ రోలే అన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ సినిమా అంటే గేమ్ ఛేంజరే అన్నారు
కాని ఇదేమైంది ఆచార్య కంటే ఘోరంగా మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం ఆచార్యలో పాటలు సీన్లు బాగున్నాయన్నారు. గేమ్ ఛేంజర్ లో అది కూడా లేదు
మొత్తానికి గేమ్ ఛేంజర్ ప్లాప్ తర్వాతే ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయిందనే విచిత్రమైన ఎనాలసిస్, కామెంట్ రూపంలో వినిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ ని రవితేజ నుంచి నాని వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. ప్రభాస్ లాంటి కటౌట్ కూడా ఛత్ర పతి హిట్ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. బాహుబలి రెండు భాగాల తర్వాత మూడు ఫ్లాప్స్ ఫేస్ చేశాడు.
కాని ఎన్టీఆర్ ఒక్కడే, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. తను కూడా స్టూడెంట్ నెం.1 , సింహాధ్రి, యమదొంగ లాంటి హిట్స్ తర్వాత ఫెల్యూర్స్ ఫేస్ చేశాడు. కాని త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత దేవరతో హిట్ మెట్టెక్కి జక్కన్న సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఒక్క మగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఎక్కడలేని కిక్ వచ్చింది.మరోకరి ఫ్లాప్ ని ఎంజాయ్ చేయటం కాదు కాని, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటం ఎంతకష్టమో ఇప్పుడు అందరికీ తెలిసినట్టుంది. అందుకే దేవర సక్సెస్ ని ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితొచ్చింది.