Jr NTR: ఒకేసారి నాలుగు సినిమాలు చేయనున్న ఎన్టీఆర్

ఇలాంటి టైంలో దేవర2 షూటింగ్ ప్లానింగ్ షాక్ ఇస్తోంది. దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగానే, వార్ 2 షూటింగ్‌తో ఏప్రిల్ నుంచి బిజీ కానున్నాడు ఎన్టీఆర్. ఇది చేస్తూనే జులై నుంచి దేవర 2 షూటింగ్‌కి కాల్ షీట్స్ కేటాయించాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 06:35 PMLast Updated on: Jan 24, 2024 | 6:35 PM

Jr Ntr Is Busy In 2024 With Four Movies Like Devarawar 2

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్.. యంగ్ టైగర్.. ఇలా ఎలా పిలిచినా తారక్ రూటే సెపరేటు. ఎందుకంటే తను ఈ ఏడాది ఒకేసారి 4 సినిమాలతో షాక్ ఇచ్చేలా ఉన్నాడు. దేవర షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఏప్రిల్ రిలీజ్ వాయిదా పడేలా ఉందంటున్నారు. ఇలాంటి టైంలో దేవర2 షూటింగ్ ప్లానింగ్ షాక్ ఇస్తోంది.

DEVARA-KALKI 2898 AD: ఏ సినిమా ఎప్పుడు రిలీజ్.. అంతా కన్ఫ్యూజన్..

దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగానే, వార్ 2 షూటింగ్‌తో ఏప్రిల్ నుంచి బిజీ కానున్నాడు ఎన్టీఆర్. ఇది చేస్తూనే జులై నుంచి దేవర 2 షూటింగ్‌కి కాల్ షీట్స్ కేటాయించాడట. అది కూడా ఓకే అనుకుంటే, సలార్ 2 ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ మేకింగ్‌లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇవన్నీ చూస్తే దేవర 1, వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ మూవీతో కలిపి ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీ కానున్నాడు తారక్. త్రిబుల్ ఆర్‌తో మూడేళ్లు సినిమాలకు దూరమైన తారక్, దేవర వల్ల కూడా మరో ఏడాదిన్నరపైనే జనాలకు దూరమయ్యాడు. ఆ గ్యాప్‌నే పూర్తి చేయటానికి ఇలా ఊపిరి సలపనంతగా వర్క్‌తో బిజీ కానున్నాడు. ఈ ఏడాది ఒకేసారి 4 సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీ మారబోతున్నాడు.