Jr NTR: దేవర మూవీతో ఎన్టీఆర్‌కు అరుదైన రికార్డు ఖాయమా?

దేవర మూవీ ఏమాత్రం పాన్ ఇండియాను షేక్ చేసినా, హిట్ మెట్టెక్కినా ప్రభాస్, బన్నీ, చరణ్ అందర్ని తారక్ మించే చాన్స్ ఉంది. అంతా పాన్ ఇండియాని షేక్ చేసిన స్టార్లే. కాని వాళ్లను తారక్ మించే అవకాశానికి రీజన్ వేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2024 | 05:49 PMLast Updated on: Feb 27, 2024 | 5:49 PM

Jr Ntr Make Sensation With Devara Movie With Koratala Shiva

Jr NTR: ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర. ఈ సినిమా పెండింగ్ షూటింగ్‌లో నాలుగు పాటల్ని ఇప్పుడు ఫిల్మ్ టీం తెరకెక్కించబోతోంది. 40 రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ సెట్లో సందడి మొదలౌతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. మొత్తానికి 4 పాటల రికార్డింగ్‌కి సిద్దమైతే, వాటి షూటింగ్ కోసం సెట్లు రెడీచేస్తోంది దేవరటీం. 15 రోజుల్లో రెడీ చేసే సెట్లలో 4 పాటల్ని తెరకెక్కించబోతోంది సినిమా యూనిట్.

500 Gas Cylinder Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

అయితే దేవర మూవీ ఏమాత్రం పాన్ ఇండియాను షేక్ చేసినా, హిట్ మెట్టెక్కినా ప్రభాస్, బన్నీ, చరణ్ అందర్ని తారక్ మించే చాన్స్ ఉంది. అంతా పాన్ ఇండియాని షేక్ చేసిన స్టార్లే. కాని వాళ్లను తారక్ మించే అవకాశానికి రీజన్ వేరు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టే, ప్రభాస్ రెండు సార్లు పాన్ ఇండియాను షేక్ చేశాడు. తన ట్యాలెంట్, క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా మొత్తం షేక్ అయ్యింది జక్కన్న వల్లే అన్నారు. సలార్ క్రెడిట్ కూడా ప్రశాంత్ నీల్‌కే దక్కింది. పుష్ప విషయంలో బన్నీకి ఇలాంటి రికార్డే వచ్చింది. కాని పుష్ప హిట్ కాబట్టి, పుష్ప 2 హిట్టైనా డైరెక్టర్‌కే ఎక్కువ శాతం క్రెడిట్ పోయే ఛాన్స్ ఉంది.

అలా చూస్తే కొరటాల శివకి టాలీవుడ్‌లో తప్ప మరెక్కడా మార్కెట్ లేదు. కాబట్టి, దేవర పాన్ ఇండియా లెవల్లో హిట్ అయితే, అది పూర్తిగా తారక్‌కి ఉన్న మార్కెట్‌నే రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే జరిగితే, దర్శకుడి ఇమేజ్ మీద డిపెండ్ కాకుండా రీసౌండ్ చేసిన స్టార్‌గా ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది.