Jr NTR: హిందీ మూవీకోసం మహేశ్ బాబు బాటలో ఎన్టీఆర్

కొమరం భీమ్ పాత్ర కోసం కసరత్తులు చేసి తారక్ అలా తన లుక్‌తో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకు రెండింతల కండలతో, టెన్ ప్యాక్స్‌తో షాక్ ఇవ్వబోతున్నాడు. ఇదంతా దేవర మూవీ కోసం కాదు, హిందీ సినిమా వార్-2 కోసం అని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 05:56 PMLast Updated on: Aug 18, 2023 | 5:56 PM

Jr Ntr May Get Six Pack For War 2 Movie

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కండలు తిరిగిన లుక్‌లో, ఎయిట్ ప్యాక్స్‌తో కనిపించింది త్రిబుల్ ఆర్ మూవీలోనే. అది కూడా కొమరం భీమ్ పాత్ర కోసం కసరత్తులు చేసి తారక్ అలా తన లుక్‌తో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకు రెండింతల కండలతో, టెన్ ప్యాక్స్‌తో షాక్ ఇవ్వబోతున్నాడు.

ఇదంతా దేవర మూవీ కోసం కాదు, హిందీ సినిమా వార్-2 కోసం అని తెలుస్తోంది. దేవర మూవీ షూటింగ్ నవంబర్‌లోగా పూర్తవుతుందట. మూడునెలలు కంప్లీట్‌గా గ్రాఫిక్స్ పనులకే కేటాయించాడట డైరెక్టర్ కొరటాల శివ. సో నవంబర్‌కల్లా దేవర టాకీ పార్ట్ అయిపోతుంది. తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ కాబోతున్నాడు. డిసెంబర్‌లో రిలాక్స్ అయ్యి, జనవరి నుంచి తారక్ కసరత్తులు షురూ చేస్తాడట. దుబాయ్ లేదంటే యూఎస్‌లో తారక్ వర్కవుట్లు ట్రైనర్స్ సమక్షంలో 3 నెలలు చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే హిందీ మూవీ వార్-2లో తనకి అపోజిట్‌గా కనిపించబోయేది కండల వీరుడు హృతిక్ రోషన్. తనకి మించేలా కండలు ఉండాలి కాబట్టే తారక్ మూడునెలలు స్పెషల్ వర్కవుట్లకు కేటాయించాడు.

ఇంచుమించు సూపర్ స్టార్ మహేశ్ బాబుని ట్రైన్ చేసే ట్రైనరే తారక్ కోసం కూడా పని చేయబోతున్నాడట. రాజమౌళి మూవీకోసం నవంబర్ నుంచి మహేశ్ బాబు కసరత్తులు చేయబోతున్నాడు. సో తన తర్వాత రెండునెల్లకు ఎన్టీఆర్ ఇదే వర్కవుట్ల ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతాడు..