రోహిత్ నిశ్చితార్ధంలో దేవర ఎక్కడ…? ముంబైలో ఉన్నాడా…?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్ధ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్ధ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులు, విశాఖ ఎంపీ భరత్ – తేజస్విని దంపతులు, సినీ నటుడు శ్రీవిష్ణు దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు. నారా రోహిత్, శిరీష(సిరీ)ల నిశ్చితార్థం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో నిరాడంబరంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.
ప్రస్తుతం నారా రోహిత్ వయసు 40 ఏళ్ళు. ఇన్నాళ్ళు నారా రోహిత్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానిపై స్పష్టత లేకపోయినా కుటుంబ సమస్యలే కారణం అని తెలుస్తోంది. గత అయిదేళ్లుగా నారా రోహిత్ సినిమాలు కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సినిమా కెరీర్ ను మొదలుపెట్టి ప్రతినిధి 2 అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శిరీషనే నారా రోహిత్ వివాహం చేసుకుంటున్నారు. వీరి ఇద్దరి మధ్య గత కొన్నాళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. ఈ విషయాన్ని రోహిత్ కుటుంబ సభ్యులకు చెప్పాడట.
తనతో సన్నిహితంగా ఉండే పెద్దమ్మ నారా భువనేశ్వరికి ఈ విషయం చెప్పగా ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వయంగా అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటుగా నారా రోహిత్ కుటుంబ సభ్యులతో కూడా చర్చించారట. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా పెళ్లి ఖర్చులు మొత్తం తానే చూసుకుంటాను అని ఘనంగా వివాహం జరిపిస్తాను అని చెప్పారట. దీనితో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివాహం చేసేస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నారా రోహిత్ ఒక రెండు సినిమాలతో బిజీగా ఉన్నా వివాహం తర్వాతనే ఆ సినిమాలు చేయనున్నాడు.
అయితే ఇప్పుడు ఓ వార్త ఇక్కడ చక్కర్లు కొడుతోంది. అసలు ఈ వేడుకకు నందమూరి కుటుంబం నుంచి చాలా మంది దూరంగా ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం ముంబై వెళ్ళాడు. అందుకే ఎన్టీఆర్ ను పిలవలేదు అని అంటున్నారు. టీడీపీ నేతలు కూడా కొందరు ఈ వేడుకకు హాజరు అయినా ఎన్టీఆర్ దూరంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారా కుటుంబానికి కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నాడు. ఇటీవల కాస్త దగ్గరవుతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఈ వేడుకకు ఎందుకు హాజరు కాలేదో తెలియాల్సి ఉంది.