Jr. NTR: నందమూరి తారక రామారావు స్టూడియోస్.. ఇక నుంచి లెక్క వేరు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత పేరుమీద స్టూడియో పెడితే ఎలా ఉంటుంది. అదే జరగబోతోంది. నిజానికి టాలీవుడ్ లో స్టూడియోలంటే, అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ, ఇక పక్కకు వెళ్లిపోయిన రామకృష్ణా స్టూడియోస్.. ఇవే.. ఐతే ఇందులో ఇప్పుడు యంగ్ టైగర్ స్టూడియో ఒకటి రెడీ కాబోతోంది.
ఆల్రెడీ శంశాబాద్ లో 5 ఫ్లోర్లతో తారేహ్ బ్యాచ్ తో కలిసి ఎన్టీఆర్ ఓ స్టూడియో కట్టేశాడు. కొరటాల శివ మేకింగ్ లో మూవీ ఆ స్టూడియో పరిసరాల్లోనే తెరకెక్కుతోంది. ఇండోర్ సీన్స్, సాంగ్స్ ఈ స్టూడియోలోనే తెరకెక్కుతాయట. ఐతే పక్కనే ఉన్న 16 ఎకరాలను తీసుకుని, మొత్తంగా 25 ఎకరాల్లో రామారావు స్టూడియోస్ పెట్టబోతున్నాడట తారక్.
తాత ఎన్టీఆర్ పేరుతో శంషాబాద్ లో తారక్ స్టూడియో ప్లాన్ చేశాడు. కొంత పనైంది. మిగతా పని షురూకాబోతున్నట్టుంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ అల్లు స్టూడియో కి భూమిపూజ చేశారు. మెగా పవర్ స్టార్ చరణ్ కూడా 20 ఎకరాల్లో స్టూడియో ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య కలిసొస్తే అప్పుడే స్టూడియో రెడీ అయ్యేది . కాని అక్కడ పంచ్ పడటంతో స్టూడియో డిజైన్ లేటవుతోందట. ఏదేమైనా చెర్రీ, బన్నీ, ఎన్టీఆర్ ముగ్గురు యంగ్ హీరోలకి ఓన్ గా స్టూడియోలు రాబోతున్నాయి.