Jr NTR: వార్ 2లో ఎన్టీఆర్‌దే డామినేషనా..? ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తాడంటే..
ఆల్రెడీ వార్ 2 షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అలాంటప్పుడు తను మళ్లీ మజిల్స్ పెంచటమేంటనే డౌట్ రాకుండా ఉండదు. అక్కడే ట్విస్ట్ ఉంది. వార్ 2 లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడు.
Jr NTR: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇండియన్ రాంబో అనేలా కండలు తిరిగి ఉంటాడు. హాలీవుడ్ హీరో రేంజ్‌లో అప్పియరెన్స్ ఉంటుంది. అలాంటి హీరోని మించేలా ఉండాలంటే, విలన్‌గా ఎన్టీఆర్ అంతకుమించి అనిపించాలి. అందుకే మజిల్స్ పెంచబోతున్నాడు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అలాంటప్పుడు తను మళ్లీ మజిల్స్ పెంచటమేంటనే డౌట్ రాకుండా ఉండదు. అక్కడే ట్విస్ట్ ఉంది.
DIL RAJU: దిల్ రాజుకేమైంది..? ఆయన జడ్జిమెంట్ గురి తప్పుతోందా..?
వార్ 2 లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడు. ఒకటి గుడ్ ఏజెంట్ కాగా.. రెండోది తన బ్రదర్ పాత్ర. అదే ఈ సినిమాలో విలన్ రోల్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి గుడ్ ఏజెంట్‌గా ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక విలన్ రోల్ షూటింగ్ అక్టోబర్‌లో ఉంటుందట. కాబట్టి.. ఈ షెడ్యల్ పూర్తి కాగానే కండలు పెంచేందుకు రెండు నెలల టైం తీసుకోబోతున్నాడు తారక్. అంతేకాదు ఇందులో డ్యూయెల్ రోల్ వేస్తున్నాడు. రెండు క్యారెక్టర్స్ చేస్తున్న తారక్.. ప్రతి పాత్రలో రెండు గెటప్స్‌లో కనిపిస్తాడు. అంటే.. మొత్తంగా నాలుగు గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఎలా చూసినా హృతిక్.. ఈ హీరోని తట్టుకోవటం కష్టమే.
హృతిక్ ఎంత మంచి డాన్సర్ అయినా తారక్ మాస్ పల్స్ తెలిసిన ఊర మాస్ డాన్సర్. క్లాసికల్ డాన్స్ కూడా తెలిసిన నటుడు. అంతేకాదు నటన మీద మంచి పట్టుండటంతో హృతిక్ కంటే ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివిన స్టార్ ఎన్టీఆర్. ఎలా చూసినా తనకి దక్కిన విలనీ రోల్, దీనికి తోడు ద్విపాత్రాభినయం, అలానే నాలుగు గెటప్పులు.. ఇవన్నీ చూస్తే వార్ 2లో అప్పర్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌దే అయ్యేలా ఉంది.