Jr NTR: ఒకే సినిమా ఇద్దరు యంగ్ టైగర్లు.. సీన్ సితారే..?

దేవరలో కూడా మూడు పాత్రలు వేస్తున్నాడు. తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా ఇలా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా తర్వాత తను చేస్తున్న హిందీ మూవీ వార్ 2 లో కూడా తారక్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 05:57 PMLast Updated on: Apr 08, 2024 | 5:57 PM

Jr Ntr Playing Dual Roles In Hrithik Roshans War 2

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో ఆంధ్రావాలాలో డ్యూయెల్ రోల్ వేస్తే ఏజ్‌కి మించిన ప్రయోగం అన్నారు. కాని అదే ఎన్టీఆర్ కాస్త ఏజ్ వచ్చాక డ్యూయెల్ రోల్ చేస్తే అదుర్స్ హిట్టైంది. అదుర్స్ సీక్వెల్ రావాలంటూ డిమాండ్ కూడా వినిపించింది. ఇక జై లవకుశ మూవీ చేస్తే అది సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఏకంగా మూడు పాత్రలు వేశాడు ఎన్టీఆర్. అలాంటి తను దేవరలో కూడా మూడు పాత్రలు వేస్తున్నాడు.

Pothina Mahesh: వైసీపీలోకి పోతిన మహేష్‌! సుజనా ఔటేనా.. టెన్షన్‌లో కూటమి..

తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా ఇలా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా తర్వాత తను చేస్తున్న హిందీ మూవీ వార్ 2 లో కూడా తారక్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడట. అసలే ఒక ఎన్టీఆర్‌ని తట్టుకోవటం కష్టమని త్రిబుల్ ఆర్ తర్వాత నార్త్ జనాలు ఫిక్స్ అయిపోయారు. సింగిల్ సాంగ్‌లో భీముడిగా త్రిబుల్ ఆర్ మూవీలో పెర్ఫామెన్స్‌కి ఫిదా అయ్యారు. అలాంటి ఎన్టీఆర్ హిందీలో డ్యూయెల్ రోల్ వేస్తే సీన్ సితారే. వార్ 2 మూవీలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరో అయితే ఎన్టీఆర్ విలన్ అన్నారు. ఈనెల 3 వ వారం నుంచి వార్2 షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నాడు. అయితే వార్ 2లో ఎన్టీఆర్ విలన్ మాత్రమే కాదు హీరో అని కూడా తెలుస్తోంది.

కారణం వార్2 లో ఇద్దరు బ్రదర్స్‌లో ఒకరు విలన్ అయితే, మరొకరు హీరో అని.. ఐతే విలన్ కోసం వెతుకుతున్న హీరో, గుడ్ పర్సన్ అయిన తారక్‌ని బ్యాడ్ పర్సన్ అనుకుని వేటాడటమే కథ అని తెలుస్తోంది. మే నెలలో ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్‌ని ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేయబోతోంది.