Jr. NTR Post: అభిమానులే నా కుటుంబం.. జూ.ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

తన బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌ చూపించిన ప్రేమకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫిదా అయ్యాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఓ లెటర్‌ రిలీజ్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2023 | 12:58 PMLast Updated on: May 22, 2023 | 12:58 PM

Jr Ntr Post On Social Media About His Fans

“కొన్ని దశాబ్ధాల నుంచి నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు వచ్చాయి. కానీ నా ప్రతీ కష్టంలో నాకు దిక్సూచిగా ఉంది. సపోర్ట్‌ ఇచ్చింది. స్థంభంలా నాకు బలాన్నిచ్చింది నా ఫ్యాన్సే. ఆ ఫ్యాన్సే నా కుటుంబం. నేను ఏ కథ ఎంచుకున్నా.. ఎలాంటి పాత్రలో నటించినా ప్రతీది నా ఫ్యాన్స్‌ కోసమే. నాకు వెన్నుదన్నుగా ఉంటున్న నా ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటాను” అంటూ పోస్ట్‌ చేశాడు ఎన్టీఆర్‌. ఇక దేవర టీంకు కూడా ఎన్టీఆర్‌ థాంక్స్‌ చెప్పాడు. తారక్‌ పుట్టినరోజు సందర్భంగా దేవర టైటిల్‌ ఎనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

కొరటాల చెప్పినట్టుగానే గతంలో ఎప్పుడూ కనిపించనంత వైల్డ్‌గా ఎన్టీఆర్‌ ఆ పోస్టర్‌లో కనిపించాడు. దీంతో దేవర టైటిల్‌, పోస్టర్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్‌కు కూడా తారక్‌ థాంక్స్‌ చెప్పాడు. పోస్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే తనకు చాలా సంతోషంగా ఫీలయ్యనంటూ చెప్పాడు. తన బర్త్‌డేను ఆ పోస్టర్‌ మరింత స్పెషల్‌ చేసిందంటూ పోస్ట్‌ చేశాడు తారక్‌. ఈ పోస్ట్‌ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్‌ ట్రిప్‌లో ఉన్నాడు తారక్‌. అక్కడి నుంచి వచ్చిన తరువాత దేవర షెడ్యూల్‌ మళ్లీ స్టార్ట్‌ అవుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. ట్రిపులార్‌ లాంటి గ్లోబల్‌ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో దేవర కోసం ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.