Jr NTR: దేవరని కావాలని ఆపింది అందుకే.. షాక్ అవుతున్న బాలీవుడ్

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు శుక్రవారం నుంచే తీయబోతున్నారు. దేవర మూవీ రిలీజ్ వాయిదా పడటానికి, పెండింగ్ షూటింగ్‌ని సడన్‌గా ఆపి వార్ 2 షూటింగ్‌కి ఎన్టీఆర్ సిద్దపడటానికి ఒకటే కారణం.. అదే మార్కెట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2024 | 06:06 PMLast Updated on: Apr 11, 2024 | 6:06 PM

Jr Ntr Postponed Devara Because Of This Reason

Jr NTR: దేవర మూవీ షూటింగ్ పూర్తికాలేదు. కొంత ప్యాచ్ వర్క్‌తోపాటు మూడు పాటలను తెరకెక్కించాలి. కనీసం నెల రోజులు కాల్ షీట్స్‌ని తారక్ ఇస్తే తప్ప ఈ సినిమా షూటింగ్ పూర్తి కాదు. ఇలాంటి టైంలో ఉన్న పళంగా సినిమా షూటింగ్ ఆపేయించి, హిందీ మూవీ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాడు తారక్. ఈనెల 12.. అంటే శుక్రవారం నుంచి హిందీ మూవీ వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నాడు.

GIRL CHEATING: దొంగ ఆమే.. బాధితురాలూ ఆమే.. నువ్ మహానటివి తల్లి..

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు శుక్రవారం నుంచే తీయబోతున్నారు. దేవర మూవీ రిలీజ్ వాయిదా పడటానికి, పెండింగ్ షూటింగ్‌ని సడన్‌గా ఆపి వార్ 2 షూటింగ్‌కి ఎన్టీఆర్ సిద్దపడటానికి ఒకటే కారణం.. అదే మార్కెట్. వార్ 2 సినిమా తీశాక, లేదా వార్ 2 మూవీ తాలూకు అప్‌డేట్లు వస్తే.. అప్పడు నార్త్ మార్కెట్‌లో ఎన్టీఆర్‌కి భారీగా ప్రచారం దక్కుతుంది. అలా పెరిగే క్రేజ్, మార్కెట్.. దేవర మూవీకి కలిసొస్తుంది. కాబట్టి.. దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేసుంటే, కేవలం త్రిబుల్ ఆర్ వల్ల వచ్చిన ఇమేజ్‌తోనే నెట్టుకురావాలి. అదే వార్ 2 షూటింగ్ మొదలు పెట్టి, దాని అప్‌డేట్స్ వస్తున్న టైంలో దేవర రిలీజ్ అయితే జనాలకు సినిమా రీచ్ అయ్యే విధానమే వేరు. అందుకే ఎన్టీఆర్ దేవరని ఏప్రిల్ 5 నుంచి వాయిదా వేయించాడని తెలుస్తోంది.

అక్టోబర్ 10కి సినిమా రిలీజ్ కాబట్టి, ఈలోపు వార్ 2 తాలూకు షూటింగ్ చేస్తే, నార్త్‌లో జనం ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. అలా దేవరకి ప్రీ పబ్లిసిటీతోపాటు మార్కెట్ దక్కుతుంది. అంతేకాదు దేవర మూవీ హిందీ రైట్స్ కరణ్ జోహార్ కొనటంతో బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్ సినిమా రీచ్ పెరుగుతుంది. చరణ్, బన్నీ, ప్రభాస్ కూడా వెళ్లని దార్లో నడుస్తున్నాడు తారక్. అందుకే ఈ ప్రపంచ ముదురుని ఇప్పుడు విశ్వముదురంటున్నారు.