Jr NTR: రిస్క్ చేస్తున్నాడా.. బాలీవుడ్ స్టార్స్ పాలిట విలన్‌గా ఎన్టీఆర్

'వార్-2'లో ఎన్టీఆర్ నటిస్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ పై ఉంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వార్-2' కోసం నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 09:15 PMLast Updated on: Feb 14, 2024 | 9:15 PM

Jr Ntr Risking His Career With War 2 In Bollywood

Jr NTR: యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతోన్న ‘వార్-2’లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ‘వార్-2’తో బిజీ కానున్నాడు.

TARAKARATNA: తారకరత్నకు ఫొటోకు ముద్దుపెట్టి కన్నీళ్లు.. వాలెంటైన్స్‌ డే రోజు అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..

కాగా ఇది ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో.. సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా.. ఇలా హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని వెనక బలమైన కారణముందని తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలకి నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ యూనివర్స్ నుంచి ‘ఏ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్-3’ సినిమాలు రాగా.. భారీ వసూళ్లతో అన్నీ మంచి విజయాలే సాధించాయి. ముఖ్యంగా ‘పఠాన్’ చిత్రం వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దాంతో ఈ యూనివర్స్ సినిమాల పట్ల క్రేజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ ‘వార్-2’, ‘టైగర్ వర్సెస్ పఠాన్’ లైన్ లో ఉన్నాయి. అయితే ‘వార్-2’లో ఎన్టీఆర్ నటిస్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ పై ఉంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వార్-2’ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాడట.

Pushpa2 spl song : పుష్ప2′ లోదిశా పటానీతో ఐటెం సాంగ్‌…

ఎన్టీఆర్ సైతం ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం వెనక బలమైన రీజన్ ఉందని సమాచారం. మొత్తం ఈ స్పై యూనివర్స్ కే మెయిన్ విలన్ గా తారక్ కనిపించనున్నాడట. స్పై యూనివర్స్ లో ఏ పాత్ర లేనంత పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ‘వార్-2’లో ఆయన పాత్ర బిగ్ సర్ ప్రైజ్ లా ఉంటుందట. ఈ సినిమా తర్వాత నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఎన్టీఆర్ పేరు మరింత మారుమోగి పోవడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ నుంచి పలు సినిమాలు వస్తాయట. ముఖ్యంగా ఆయన పాత్ర ప్రధానంగా ఒక సోలో ఫిల్మ్ ఉంటుందట. ఇక ఒక పార్ట్ లో అయితే ఈ మొత్తం స్పై హీరోలందరూ ఏకమై ఎన్టీఆర్ ని ఢీ కొడతారట.

సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ వంటి వారంతా ఒకవైపు.. ఎన్టీఆర్ ఒక్కడే మరోవైపు అన్నట్టుగా పోరు ఉంటుందట. అదే జరిగితే ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో హిందీ స్టార్స్ ని డామినేట్ చేసి మొత్తం క్రెడిట్ కొట్టేస్తాడు అనడంలో సందేహం లేదు.