Devara: టైగర్ వేట.. దేవరతో భారీ రిస్క్‌ చేస్తున్న ఎన్టీఆర్

మొదటి పార్ట్ దేవర.. అక్టోబర్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద ‘హిట్’ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకువెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 08:33 PMLast Updated on: Apr 20, 2024 | 8:33 PM

Jr Ntr Taking Big Risk For His Upcoming Movie Devara At Box Office

Devara: ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ తర్వాత ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందతోంది. ఈ మూవీపై ఆయన ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. ఈ మూవీతో ఎన్టీఆర్ తనను తాను రిస్క్‌లో పడేసుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది. ఇది రెండు పార్టులుగా రానుంది.

Kurchi Madathapetti song: కుర్చీ మడతపెట్టి పాటకు యమ క్రేజ్‌.. 200 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌

మొదటి పార్ట్ దేవర.. అక్టోబర్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద ‘హిట్’ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకువెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఎపిక్ యాక్షన్ డ్రామా RRR నుంచి, ఇతర భాషా మార్కెట్లలో తారక్‌కు ఇంకా పెద్దగా గుర్తింపు లేదని అంగీకరించాలి. అదనంగా, ఈ చిత్ర దర్శకుడు, కొరటాల శివ, రాజమౌళిలా ‘పాన్-ఇండియన్’ ఫిల్మ్ మేకర్ కాదు. నాన్ తెలుగు మార్కెట్లలో దేవర థియేట్రికల్ హక్కుల విలువ రూ.100 కోట్లు. ఎన్టీఆర్ స్థాయి నటుడికి ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే, బ్రేక్‌ఈవెన్‌ సాధించడానికి ఈ చిత్రం తప్పనిసరిగా అద్భుతమైన హిట్ టాక్ అందుకోవాలి. తెలుగులో కూడా ఈ చిత్రం రూ.120 కోట్లకు అమ్ముడైంది. ఆర్ఆర్ఆర్‌కు ముందు తారక్ కెరీర్ అత్యధిక గ్రాసర్ మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రం 85 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.

నిజానికి, తన పేరుతో 100 కోట్ల షేర్ లేని టాప్ లీగ్ తెలుగు స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. తారక్‌కు మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులలో సరైన ఇమేజ్ లేకపోవడం వల్ల తారక్ సినిమాలు భారీ కలెక్షన్లకు దూరంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ తన మార్కెట్‌ను పెంచుకునే క్రమంలో తన స్టార్‌డమ్‌ని పణంగా పెట్టేస్తున్నట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఓవరాల్‌గా, దేవర్ మూవీ ‘హిట్ అనిపించుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్‌ను తప్పనిసరిగా సంపాదించాలి. ఇది తారక్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే చాలా పెద్ద పని. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.