Jr. NTR: రామ్ చరణ్, ప్రభాస్ హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్ కి వెళ్లి తిరిగి రాగానే కొరటాల శివ మేకింగ్ లో యాక్షన్ సీన్లు తెరకెక్కబోతున్నాయి. ఆతర్వాత ఈ హీరోకి కొత్త చిక్కొచ్చేలా ఉంది. ఈ మూవీ దసరాలోగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.. అప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా తోపాటు హిందీ మూవీ వార్ 2 షూటింగ్ షురూ అవుతుంది. అదే తారక్ కి తలనొప్పి తెచ్చేలా ఉంది.
ప్రశాంత్ నీల్ మేకింగ్ లో శ్రద్ధా కపూర్ తో జోడీకట్టనున్న ఎన్టీఆర్, వార్ 2 మూవీలో ఆలియా భట్ తోజోడీకట్టబోతున్నాడు. ఈరెండు ప్రాజెక్టులు ప్యారలల్ గా తెరకెక్కేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రతీ నెలలో 10 రోజులు ఒక మూవీ, మరో పదిరోజులు మరో మూవీ అంటూ డేట్స్ ఇచ్చాడట ఎన్టీఆర్.
వార్ 2, తోపాటు ప్రశాంత్ నీల్ మూవీ స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలుస్తోంది. సో ఈ రెండు సినిమాల్లో చరన్, ప్రభాస్ హీరోయిన్లతో జోడీకడుతున్నాడు తారక్. త్రిబుల్ ఆర్ లో చెర్రీ సరసన మెరిసిన ఆలియా వార్ 2 లో తారక్ సరసన మెరవనుంది. ఇక సాహో ఫేం శ్రద్దా ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ తోజోడీ కడుతోంది. ఐతే ఈ ఇద్దరు హీరోయిన్లు తలా 3 సినిమాలు కమిటవ్వటంతో, వాళ్ల డేట్లకు ఎన్టీఆర్ డేట్లకు సెట్ అవ్వట్లేదట.
దీంతో రెండు సినిమాలు ప్యార్ లల్ గా తెరకెక్కడం కష్టం అని తెలుస్తంది. హీరోయిన్లు ఏడాది క్రితమే కమిటైన 3 సినిమాలకు డేట్లివ్వటంతో, వాళ్ల డేట్ల కోసం తారకే తన డేట్లను అడ్జెస్ట్ చేసుకుని నెలకి ఒక్కో మూవీకి పదిరోజులు కేటాయిస్తున్నాడు. దీనివల్ల నష్టం ఏంటంటే, నెలకి 20 రోజులు షూటింగ్ మిగతా 10 రోజులు ఖాలీగా ఉండాల్సి వస్తుందట..