Jr. NTR: ఎన్టీర్‌30 నుంచి యాక్షన్‌ అప్డేట్‌.. దేవర వర్సెస్‌ బైరవ.

ఎన్టీర్‌30 మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నెల రోజుల పైనే అయింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకోబోతున్న ఈ మూవీ.. రెండూ యాక్షన్‌ సీన్సే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ హైవోల్టెజ్‌ యాక్షన్‌ మూవీకి ఈ సీన్స్‌ మెయిన్‌ కానున్నాయట. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2023 | 05:00 PMLast Updated on: Apr 29, 2023 | 5:00 PM

Jr Ntr Upcoming Movie

ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగే ఈ షెడ్యూల్‌ మూవీకే హైలెట్‌గా నిలిచే కుస్తీ పోటీల ఎపిసోడ్‌ జరగబోతుందట. జాతర సెటప్‌లో ఉండే ఈ సీన్స్‌ తారక్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ మధ్య జరిగే కుస్తీ పోటికి సంబందించినవేనని ఇండస్ర్టీ వర్గల్లో టాక్‌ నడుస్తుంది. ఈ మూవీలో నుంచి వచ్చిన ఇంకో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ద్వార తెలిసిన విషయం ఏంటంటే.. ఇందులో హీరో తారక్‌ పేరు దేవర, విలన్‌ పేరు బైరవ అని న్యూస్‌.

దీంతో అప్పుడే ఫ్యాన్స్‌ దేవర వర్సెస్‌ బైరవ అని ఇంటర్నెట్‌లో వైరల్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌ కొరటాల శివ ఇప్పటికే స్టోరీ లైన్‌ గురించి చెప్పిన.. ఈ లీక్ గురించి తెలిసాక ఫ్యాన్స్‌లో ఎవరు తగ్గట్లే. ఈ మూవీతో హీరో తారక్‌.. డైరెక్టర్‌ రాజమౌళీ మూవీ తర్వాత వచ్చే డిజాస్టర్‌ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసి పాన్‌ వరల్డ్‌ రేంజ్‌ మరో బంపర్‌ హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. అల్రేడి రామ్‌చరణ్‌ ట్రిపుల్‌ఆర్‌ తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లోనే మూవీ తీసి ప్లాఫ్‌ ఫేస్‌ చేశాడు. కానీ డైరెక్టర్‌ కొరటాల ఈ మూవీతో అల జరగదని స్టోరీ లైన్‌ కూడా ముందే చెప్పేసాడు.

ఎన్టీఆర్‌30 మూవీ నెక్ట్స్‌ షెడ్యూల్‌ గోవాలో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ షెడ్యూల్‌ ఈరోజు ఫినిష్‌ చేసి.. కొంచెం గ్యాప్‌ ఇచ్చి థర్డ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ యాక్ట్‌ చేస్తుంది. ప్రకాష్‌రాజ్‌, హీరో శ్రీకాంత్‌ కూడా ఈ మూవీలో కీ రోల్‌ చేస్తున్నారు. చూద్దాం ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ థియేటర్‌లో ఫ్యాన్స్‌ని ఏ రేంజ్‌లో అలరిస్తుందో.