Jr NTR: ఫ్యామిలీ టైం.. హఠాత్తుగా జపాన్‌కు ఎన్టీఆర్

సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక చోటుకి వెళ్తూ కెమెరాలకి చిక్కాడు. ఎన్టీఆర్ లేటెస్ట్‌గా తన భార్య, పిల్లలతో కలిసి జపాన్ బయలుదేరి వెళ్ళాడు. తన ఫ్యామిలీతో కలిసి జపాన్‌లో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2023 | 03:54 PMLast Updated on: Dec 26, 2023 | 3:54 PM

Jr Ntr Went To Foriegn Vacation With Family Took A Break From Devara

Jr NTR: ఎన్టీఆర్ నుంచి ఈ సంవత్సరం ఎలాంటి సినిమా రాలేదని బాధలో ఉన్న అభిమానులకి వచ్చే సంవత్సరం మాత్రం పండగే. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నిక్ వాల్యూస్‌తో రూపొందుతున్న దేవర శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. అలాగే బాలీవుడ్‌లో వార్ 2 అనే ఇంకో హై బడ్జట్ మూవీలో కూడా ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ అగస్ట్ 14న థియేటర్‌లలో ల్యాండ్ అవ్వనుంది.

DEVARA: గ్లింప్స్ రెడీ.. పుష్ప, దేవరలో గంగమ్మ జాతర..!

ఈ రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక చోటుకి వెళ్తూ కెమెరాలకి చిక్కాడు. ఎన్టీఆర్ లేటెస్ట్‌గా తన భార్య, పిల్లలతో కలిసి జపాన్ బయలుదేరి వెళ్ళాడు. తన ఫ్యామిలీతో కలిసి జపాన్‌లో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయలుదేరి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ పిల్లలిద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత బయట కనపడేసరికి అక్కడ ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్స్ లో ఫోటోలు కూడా తీసుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తాడు. దేవరని ఎన్టీఆర్ కెరీర్‌లోనే నెంబర్ వన్ చిత్రంగా, గుర్తుండిపోయేలా దర్శకుడు కొరటాల శివ తీర్చిదిద్దుతున్నాడు.

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దేవర మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ వార్ 2లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఎన్టీఆర్ హిందీలో నటిస్తున్న ఈ మొట్టమొదటి చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.