Jr NTR: బ్రేక్ తప్పదా.. వార్2కి దేవర బ్రేక్
జనవరి చివర్లో వార్2లోకి అడుగుపెడుతాడనుకుంటే.. డిసెంబర్ నాటికి దేవర షూటింగ్ పూర్తికాదట. దేవర షూటింగ్ డిసెంబర్‌నాటికి పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఆలస్యమైతే.. వార్2 షూటింగ్ మార్చిలో మొదలవుతుందని సమాచారం.
Jr NTR: పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న ఎన్టీఆర్ అనుకున్న టైంలో వార్2 షూటింగ్‌లో జాయిన్ కాలేకపోతున్నాడు. దేవర మూవీ.. వార్2కు బ్రేకులేసింది. జనవరిలో వార్2 షూటింగ్‌లోకి వెళ్లాల్సిన తారక్.. ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. డిసెంబర్ నాటికి దేవర షూటింగ్ పూర్తిచేసి వెంటనే తారక్ అమెరికా వెళ్లి కండలు పెంచాలనుకున్నాడు. అందరూ ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో ఇక్కడే వర్కవుట్స్ చేస్తుంటే.. తారక్ మాత్రం వార్2 కోసం.. అమెరికాలో మేకోవర్ అవుతాడని తెలిసింది.
BRS MP SEATS: కారు తిరుగుతుందా..? కారుకు పొంచి ఉన్న మరో గండం..
జనవరి చివర్లో వార్2లోకి అడుగుపెడుతాడనుకుంటే.. డిసెంబర్ నాటికి దేవర షూటింగ్ పూర్తికాదట. దేవర షూటింగ్ డిసెంబర్‌నాటికి పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఆలస్యమైతే.. వార్2 షూటింగ్ మార్చిలో మొదలవుతుందని సమాచారం. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అయితే.. ఓ రెండు వారాలపాటు.. ఎన్టీఆర్ ఇండియా మొత్తం తిరిగి ప్రమోషన్ చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన ఫిబ్రవరిలో.. లేదంటే ఏప్రిల్ చివర్లో వార్2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం వుంది. వార్2 పూర్తి కాకుండానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ జాయిన్ అవుతాడు.
డిసెంబర్ 22న ‘సలార్’ రిలీజ్ కాగానే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కథకు ఫైనల్ టచ్ ఇస్తాడు. 2024 సమ్మర్ నాటికి స్కిప్ట్ రెడీ చేయడంతోపాటు.. మేలో సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తాడట. అయితే.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశం వుందని చిత్ర వర్గాలంటున్నాయి.