Jr. NTR: వెల్కం టూ ఫాదర్ హుడ్.. చరణ్‌కు తారక్ కంగ్రాట్స్..
ఫ్రెష్‌గా ఫాదర్ హుడ్‌లోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు. ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ తారక్ కూడా చరణ్‌కు పేరెంట్స్ క్లబ్‌లోకి స్వాగతం అంటూ ట్వీట్ చేశాడు.

Jr. NTR wishes Ram Charan through a message saying welcome to fatherhood
ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తారక్.. పిల్లలను పెంచడం ఓ గొప్ప అనుభూతి అంటూ ట్వీట్ చేశాడు. పిల్లలతో గడిపే ప్రతీ క్షణం అమూల్యమైందని.. ఆ క్షణాలు చరణ్ జీవితంలో ఇప్పుడు మొదలయ్యాయంటూ చెప్పాడు. పెళ్లైన పదేళ్లైనా రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేరు. దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఎప్పుడూ ఏ రూమర్‌ను పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లారు చరణ్ ఉపాసన.
ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు బేబీ పుట్టిడంతో మెగా ఫ్యామిలీలో సంబారాలు అంబరాన్నంటాయి. నిన్న రాత్రే జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఉపాసన.. ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఫ్యాన్స్ అంతా హాస్పిటల్ దగ్గరకి చేరుకున్నారు. హాస్పిటల్ ముందు రామ్ చరణ్ ఉపాసన ఫొటోలతో సంబరాలు చేస్తున్నారు. ట్విటర్‌లో మెగాప్రిన్సెస్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.