Jr NTR: ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. క్రేజీ అప్‌డేట్..

లేటెస్ట్‌గా గోవాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర.. నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర మొదటి భాగం రిజల్ట్‌ను బట్టి రెండో భాగం ఉండనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2024 | 01:28 PMLast Updated on: Mar 28, 2024 | 1:28 PM

Jr Ntr With Prashanth Neel Making Movie In Two Parts After Devara

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. దేవర పార్ట్ 1ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Naga Chaitanya-Samantha: ఫోన్ ట్యాపింగ్.. నాగ చైతన్య, సమంత విడాకులకు అసలు కారణం ఇదేనా

లేటెస్ట్‌గా గోవాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర.. నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర మొదటి భాగం రిజల్ట్‌ను బట్టి రెండో భాగం ఉండనుంది. దీంతో.. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కంప్లీట్ చేయగానే.. ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. కుదిరితే.. ఈ ఏడాది చివర్లోనే ఎన్టీఆర్ 31 స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఇప్పట్లో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండే ఛాన్స్ లేదు. కానీ.. కెజియఫ్, సలార్ దారిలోనే ఎన్టీఆర్ 31ని ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అంటే.. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడట.

ఇప్పటి వరకు నీల్ చేసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఉగ్రం తప్ప.. కెజియఫ్ రెండు భాగాలుగా వచ్చింది. త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా టు పార్ట్స్ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. టైగర్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.