DEVARA: ఓ మైగాడ్.. ఎన్టీఆర్ మూవీ దేవరని రానీయరా..?
90 శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తైందట. మిగతా పది శాతం షూటింగ్ విషయంలోనే కొరటాల శివ.. పార్ట్ 2 లోని కొన్ని సీన్లు ముందే తీసి, తర్వాత పార్ట్ 1 పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేయాలనుకున్నాడట. ఆ ప్లానింగే ఏప్రిల్ 5కి ఈ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకుండా చేసింది.
DEVARA: దేవర మూవీ ఏప్రిల్ 5కి కాకుండా అక్టోబర్ 10 కి వాయిదా పడటం వెనక షూటింగ్ డిలే కారణం అన్నది అందరికి తెలిసిందే. కాని ఆ డిలేకి కారణం కొరటాల శివ ప్లానింగే అని తెలుస్తోంది. ఏదో సైఫ్‌కి గాయమైంది. చికిత్స వల్ల ఓ షెడ్యూల్ వాయిదా పడిందన్నారు. కాని 90 శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తైందట. మిగతా పది శాతం షూటింగ్ విషయంలోనే కొరటాల శివ.. పార్ట్ 2 లోని కొన్ని సీన్లు ముందే తీసి, తర్వాత పార్ట్ 1 పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేయాలనుకున్నాడట.
Mahesh Babu: మహేష్ బాబాయ్‌కి టిక్కెట్.. ప్రచారానికి సూపర్ స్టార్ వస్తాడా..?
ఆ ప్లానింగే ఏప్రిల్ 5కి ఈ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకుండా చేసింది. ఇలా డైరెక్టర్ వల్ల దేవర సినిమా వాయిదా పడితే, ఈ సినిమా టీజర్ మాత్రం మరో డైరెక్టర్ వల్ల వాయిదా పడుతోంది. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. దేవరకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న తను, కంప్లీట్‌గా రజినీకాంత్ సినిమాతోపాటు 12 సినిమాలతో బిజీ అయ్యాడు. దీంతో మార్చ్ 8కి దేవర టీజర్ అనుకుంటే, దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసి రెడీ చేసే పరిస్థితిలో అనిరుధ్ లేడట.
చేతిలో ఉన్న 12 సినిమాలతో అనిరుద్ బిజీ అయితే మాత్రం, అక్టోబర్ 10 కి వాయిదా పడ్డ దేవర, అప్పుడు కూడా విడుదలవ్వటం కష్టమే అంటూ అనుమానాలు పెరిగాయి. సో.. అనిరుద్ దయ తలిస్తేనే దేవర టీజర్ రెడీ అవుతుందా? అక్టోబర్ 10న అసలు దేవర రిలీజ్ అవుతుందా..? ఈడౌట్లకు ఆన్సర్ అనిరుధ్ కూడా ఇచ్చేలా పరిస్థితులు లేవని తెలుస్తున్నాయి.