Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ వదిలారు. పోస్టర్‌లో సముద్రంలో పడవ మీద నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ మాములుగా లేదు. పోస్టర్‌ని బట్టి చూస్తే అందరూ ఊహించిన దానికంటే కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 02:37 PMLast Updated on: Jan 01, 2024 | 2:37 PM

Jr Ntrs Devara Movie Glimps Release Date Announced

Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ, తాజాగా మేకర్స్ కళ్ళు చెదిరే పోస్టర్ విడుదల చేశారు. ఈ కొత్త సంవత్సరం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా దేవర నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ వదిలారు.

YS SHARMILA: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు ముహూర్తం ఫిక్స్‌.. అన్న వదిలిన బాణం.. అన్ననే ముంచేయబోతుందా?

పోస్టర్‌లో సముద్రంలో పడవ మీద నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ మాములుగా లేదు. పోస్టర్‌ని బట్టి చూస్తే అందరూ ఊహించిన దానికంటే కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది. ఈమూవీలో తారక్ సముద్ర వీరుడిగా కనిపించనున్నట్లు ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది. సముద్రం, అలలు, పడవలతో పోస్టర్ డిజైన్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక గ్లిమ్ప్స్ బయటకి వస్తే బాక్సాఫీస్‌పై దేవర దండయాత్ర మొదలైపోయినట్లే. గ్లింప్స్‌తోనే దేవర ప్రమోషన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ఇండియన్ స్క్రీన్‌పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్‌తో సినిమా తెరకెక్కనుంది.

రెండు భాగాలుగా రానున్న ఈ పాన్ ఇండియా మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మూవీ అప్డేట్స్ కోడం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.