DEVARA: దసరాకు దేవర దండయాత్ర.. ఇక పూనకాలే

సైఫ్ ఆలీ ఖాన్ గాయపడడం, అనిరుధ్ రవిచంద్రన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండడంతో మ్యూజిక్ ఆలస్యం కావడం వల్ల చిత్ర షూటింగ్ అనుకున్నంత వేగంగా పూర్తి కాలేదు. ఇప్పటికీ ఒక్క పాట షూట్ కూడా చేయలేదు ‘దేవర’ టీమ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 04:55 PMLast Updated on: Feb 16, 2024 | 4:55 PM

Jr Ntrs Devara Movie Release Date Announced

DEVARA: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్ర విడుదల తేదీ నిర్ణయించింది చిత్ర యూనిట్. వచ్చే దసరా కానుకగా.. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ 5న ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే సైఫ్ ఆలీ ఖాన్ గాయపడడం, అనిరుధ్ రవిచంద్రన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండడంతో మ్యూజిక్ ఆలస్యం కావడం వల్ల చిత్ర షూటింగ్ అనుకున్నంత వేగంగా పూర్తి కాలేదు.

Jr NTR: ఎన్టీఆర్ లేకుండానే హిందీ మూవీ వార్ 2 షూటింగ్ షురూ..?

ఇప్పటికీ ఒక్క పాట షూట్ కూడా చేయలేదు ‘దేవర’ టీమ్. దీంతో నాలుగు డ్యూయెట్స్‌తో పాటు ఓ ఐటెం సాంగ్ చిత్రీకరణ పెండింగ్ ఉండగా, 40 రోజుల టాకీ అండ్ యాక్షన్ పార్ట్ కూడా జరగాల్సి ఉంది. దీంతో కొత్త రిలీజ్ డేట్‌ని కన్ఫార్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. ఉగాదికి వస్తుందనుకున్న సినిమా, వాయిదా పడి దసరా బరిలో నిలుస్తోంది. దసరా సెలవులు కలిసి వస్తుండడంతో పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ. నిజానికి ఉగాది నుంచి వాయిదా పడిన ‘దేవర’ మూవీ, ఆగస్టు 15న వస్తుందని అనుకున్నారంతా. అల్లు అర్జున్- సుకుమార్ ‘పుష్ప 2’ మూవీని ఆ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా వాయిదా పడవచ్చని ప్రచారం జరిగినా, బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిలీజ్ డేట్‌ని మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట.

దీంతో ‘దేవర’ అక్టోబర్‌కి వెళ్లింది. అక్టోబర్ 10న ‘దేవర’ రిలీజ్ అవుతుంటే, ఆ తర్వాత మహానవమి, దుర్ఘాష్టమి, దసరా, ఆ తర్వాత ఆదివారం.. ఇలా వరుసగా ఐదు రోజులు హాలీడేస్ కలిసి రాబోతున్నాయి. కాబట్టి పాజటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర ఈజీగా రూ.500 కోట్లు వసూలు చేసే బొమ్మగా ‘దేవర’ మూవీని చూస్తున్నారు ట్రేడ్ పండితులు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.