Devara: వేట మొదలు.. దేవర టీజర్ డేట్ ఫిక్స్..!

ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. విలన్, హీరోయిన్ లుక్స్ కూడా రివీల్ చేశారు. దీంతో దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ముందుగా అనుకున్నట్టుగా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న దేవర నుంచి టీజర్, లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 08:03 PMLast Updated on: Dec 06, 2023 | 8:03 PM

Jr Ntrs Devara Teaser Will Be Released Soon

Devara: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఈ లెక్కన సరిగ్గా మరో నాలుగు నెలల్లో థియేటర్లోకి రానుంది దేవర. ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. విలన్, హీరోయిన్ లుక్స్ కూడా రివీల్ చేశారు. దీంతో దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ముందుగా అనుకున్నట్టుగా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న దేవర నుంచి టీజర్, లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనుకున్నారు.

Ram Gopal Varma: తెలంగాణలో జనసేన ఓటమి.. పవన్‌పై మరోసారి వర్మ సెటైర్లు..

అప్పటికీ లేదంటే సంక్రాంతికి దేవర సాలిడ్ ట్రీట్ ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు దేవర టీజర్ డేట్ మరింత ముందుకొచ్చింది. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దేవర ఫస్ట్ లుక్ టీజర్‌ని క్రిస్మస్ సందర్భంగా అంటే, డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. పాన్ ఇండియా సినిమా అయినా కూడా షెడ్యూల్ డిలే లేకుండా జరుగుతున్న దేవర షూటింగ్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా యాక్షన్ పార్ట్‌నే షూట్ చేసారు.

ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్‌లో ఉన్న దేవర నేటి నుంచి సరిగ్గా 122 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్, దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక టీజర్ బయటికి రావడమే లేట్.. అన్ని రికార్స్డ్ బద్దలు అవ్వడం ఖాయమని అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.