ఎన్టీఆర్ కు యాక్సిడెంట్, అంత సీన్ లేదు నిజం ఇదే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందా…? ఆయన ప్రయాణించే కారు ప్రమాదానికి గురైందా…? జూబ్లీహిల్స్ లో జరిగిన ప్రమాదంలో ఎన్టీఆర్ చేతికి బలమైన గాయాలు అయ్యాయా…? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది నిజమే అంటూ జరుగుతున్న ప్రచారం ఫాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది. 2009 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఎన్టీఆర్ కు ఇలాగే కారు ప్రమాదం జరిగి, ప్రాణాపాయం వరకు వెళ్ళాడు. ఇక నందమూరి కుటుంబంలో కారు ప్రమాదాలు తరుచుగా జరుగుతూ… జానకీ రామ్, హరికృష్ణ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి.
దీనితో ఫ్యాన్స్ ఈ వార్తలు చూసి ఒక్కసారి భయపడిపోయారు. తమ అభిమాన హీరోకి ఏం కావొద్దు అంటూ పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఆ ప్రమాదం నిజమేనా…? అంటే నూటికి నూరు శాతం తప్పు. అది ఫేక్ ప్రచారం అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ కూడా కొట్టిపారేసింది. ఇటీవలే దేవర సినిమా షూట్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్… ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ చేయి కాస్త బెణికింది. దీనితో వైద్యులను సంప్రదించగా చేతికి బ్యాండ్ వేసి రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆ బ్యాండ్ వేసిన ఫోటోని సోషల్ మీడియాలో తిప్పుతూ ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్ కూడా గాయం చిన్నదే ఏ మాత్రం కంగారు పడవద్దని ఫ్యాన్స్ ని కోరాడు.
అంతకు మించి ఏం జరగలేదు, జూబ్లిహిల్స్ లో కారు ప్రమాదం జరగలేదు, ఎన్టీఆర్ కారు అదుపు తప్పలేదు, ఆయన చేయి విరగలేదు… కాబట్టి ఫ్యాన్స్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఆవేశ పడవద్దు అంటున్నాయి మీడియా వర్గాలు. దేవర సినిమా ప్రమోషన్లను ఎన్టీఆర్ త్వరలోనే మొదలుపెడతాడు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలను కూడా విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. వచ్చే నెల 27 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సమయంలో ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని ఎన్టీఆర్ ఆఫీస్ కోరుతోంది.